హీరో కావాల్సిన దేవి శ్రీ ఎందుకు డ్రాప్ అయ్యాడు.. ఎవ‌రు వ‌ద్ద‌న్నారు…!

తెలుగు సినిమాలలో మంచి హైప్ ఉన్న పాటలను పాడుతూ ఆ హీరో అభిమానులను సైతం బాగా అలరిస్తూ ఉంటాడు దేవిశ్రీప్రసాద్. తెలుగు సినిమా పరిశ్రమలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతో మంది హీరోలకు ఎన్నో అద్భుతమైన పాటలను కూడా అందించారు. అయితే గత కొంత కాలంగా కెరియర్ పరంగా డౌన్ అయినట్టుగా కనిపిస్తోంది ఈయనది.. వరుస సినిమాలు చేయాల్సిన డిఎస్పి ఒక్కో సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్నారు.

కానీ రీసెంట్ గా అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాతో దేవి శ్రీ ప్రసాద్ మరొకసారి ప్రేక్షకులను అలరించాడు. ఇక ఈ చిత్రానికి ఈ సినిమా పాటలు హైలెట్ గా నిలిచాయి. ఈ చిత్రం తర్వాత దేవిశ్రీప్రసాద్ మళ్లీ వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఇదిలా ఉంటే దేవిశ్రీప్రసాద్ ఆడియో ఫంక్షన్లో ఎంతో హుషారుగా కనిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

చూడటానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఫుల్ జోష్ గా ఉండే దేవిశ్రీప్రసాద్ హీరోగా కూడా సక్సెస్ అవుతారని చాలామంది అనుకున్నారు. అంతేకాకుండా పలు ఆడియో ఫంక్షన్ లో కూడా ప్రముఖులు సైతం ఈయనని హీరోగా సినిమా చేయాలని చెబుతూ ఉండేవారట. దాంతో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటించేందుకు సిద్ధమైపోయారు. అయితే కాస్త సమయం తీసుకొని మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్న తనను ప్రేక్షకులు హీరోగా అంగీకరిస్తారా లేదా అన్న అనుమానం దేవిశ్రీ ప్రసాద్ కి వచ్చిందట.

దేవిశ్రీప్రసాద్ సన్నిహితులు ఆయనతో ఒక మాట చెప్పారట.. ఒకవేళ హీరోగా సక్సెస్ కాలేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా నీ కెరియర్ దెబ్బతింటుందని హెచ్చరించారట . ఇక దీనిని దృష్టిలో పెట్టుకుని దేవిశ్రీప్రసాద్ కూడా ఆలోచించి హీరోగా ఎంట్రీ ఇవ్వకూడదని కేవలం మ్యూజిక్ డైరెక్టర్ గానే తన కెరియర్ కొనసాగించాలని నిర్ణయం తీసకున్ననట్లుగా సమాచారం.

Share post:

Popular