స్టార్ హీరోయిన్స్ ను వివాహం చేసుకున్న దర్శకులు ఎవరంటే..?

స్టార్ హీరోయిన్స్ ను సినీ దర్శకులు ప్రేమించి వివాహం చేసుకోవడం అనే విషయం కొత్తేమీ కాదు. సుహాసిని, రమ్యకృష్ణ , రోజా లాంటి స్టార్ హీరోయిన్ ల హవా కొనసాగుతున్న అప్పుడే ఇలా ఎంతోమంది స్టార్ హీరోయిన్లు దర్శకులను ప్రేమించి వివాహం చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఆ దర్శకులను వీరు వివాహం చేసుకోవడమే కాకుండా వారి డైరెక్షన్ లో ఎన్నో సినిమాలను తెరకెక్కించడం జరిగినది.ఇకపోతే ఎవరెవరు హీరోయిన్లు , దర్శకులను వివాహం చేసుకున్నారో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

1. నయనతార – విఘ్నేష్ శివన్:
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్ ను సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార జూన్ 9వ తేదీన అంగరంగ వైభవంగా వివాహం చేసుకోబోతోంది. త్వరలోనే వీరి వివాహ వేడుకకు సంబంధించిన అన్ని ఫోటోలను, వీడియోలను నెట్ ఫ్లెక్స్ ఓ టీ టీ వేదికగా ప్రసారం చేయనున్నారు. ఇకపోతే లేడీ సూపర్ స్టార్ నయనతార , విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఎన్నో సినిమాలలో నటించి.. ప్రేమించి..వివాహం చేసుకోబోతోంది.

2. సుహాసిని – మణిరత్నం:
కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం కూడా ప్రముఖ స్టార్ హీరోయిన్ సుహాసిని ని వివాహం చేసుకున్నారు ..ఇక మణిరత్నం డైరెక్షన్ లో కూడా సుహాసిని ఎన్నో చిత్రాలలో నటించింది.

3. రోజా – సెల్వమని:
ప్రముఖ లేడీ స్టార్ హీరోయిన్ రోజాను ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వమని నీ ప్రేమించే వివాహం చేసుకున్నారు. సెల్వమణి దర్శకత్వంలో రోజా ఎన్నో చిత్రాలలో నటించింది. రోజా తెలుగమ్మాయి కావడం సెల్వమని పక్క తమిళీయన్ కావడం గమనార్హం.

4. రమ్యకృష్ణ – కృష్ణవంశీ:
ప్రముఖ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ, కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన చంద్రలేఖ సినిమాలో నటించింది .వీరిద్దరి మధ్య ఆ సినిమాతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. మోహన్ బాబు, బ్రహ్మానందం సహాయంతో వీరి పెళ్లి జరిగింది.

5. ఖుష్బూ – సుందర్ :
వెంకటేష్ సరసన కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రామానాయుడు నిర్మాణ సారథ్యంలో మొదటిసారి కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా ఖుష్బూ తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ సుందర్ ను వివాహం చేసుకుంది.

Share post:

Popular