ఆ స్టార్ హీరో వల్లే రిచా కెరీర్ నాశనం అయిందా..?

రిచా గంగోపాధ్యాయ.. తన నటనతో, అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె.. అందం , అభినయంతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ వరుస సినిమాలలో హీరోయిన్ గా నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ గా రిచా గుర్తింపు పొందలేకపోవడం గమనార్హం. ఇక మంచి సినిమాలు చేసినప్పటికీ గుర్తింపు రాలేకపోయింది.

ఇకపోతే కొన్ని సినిమాలు చేసి ఉంటే కచ్చితంగా ఈమెకు అన్ని కలిసి వచ్చేమో కానీ కొన్ని కారణాల వల్ల మధ్యలోనే తన సినీ కెరీర్ కు పులి స్టాప్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే రిచా గంగోపాధ్యాయ తన కెరియర్ కు దూరం కావడానికి కారణం ఒక స్టార్ హీరో తో ప్రేమలో పడడం అనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ వారిద్దరూ మొదట స్నేహితులుగా మారారు అట.

ఇక ఆ స్టార్ హీరోతో రీచా కూడా చాలా చనువుగా ఉండేది . ఇక దానిని అవకాశంగా తీసుకున్న ఆ స్టార్ హీరో రిచా తో అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడట. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆమె ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఇలాగే వాడుకుంటారు కదా అని నిర్ణయం తీసుకుని ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి శాశ్వతంగా దూరం అయింది అని వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి అతడు ఆమె తో హద్దులు దాటి రొమాన్స్ చేయడం..పెళ్లి మాట వచ్చేసరికి నా అందం ముందు నువ్వెంత అంటూ చాలా చీప్ గా ఆమెతో మాట్లాడారట. అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది. కెరీర్ పై దృష్టి పెట్టకుండా హీరో మాయలో పడిపోయింది. ఈమె తన కెరీర్ని నాశనం చేసుకుంది అని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇకపోతే హీరోయిన్ గా మంచి అవకాశాలను అందుకోవాల్సిన ఈమె ఇలా ప్రేమ పేరుతో జీవితాన్ని నాశనం చేసుకుంది.

Share post:

Popular