నానికి మైండ్ బ్లాకింగ్ షాకిచ్చిన ఆ స్టార్ హీరో .. అస్సలు ఊహించలేదే..?

తాను ఒకటి తలిస్తే దైవం మరోకటి తలచింది అన్నట్లు..నాని ఒకటి తలిస్తే..జనాలు మరోలా రిజల్ట్ ఇచ్చారు. పాపం..నానికి గత కొంత కాలం నుండి టైం కలిసి రావడం లేదు ఏది ముట్టుకున్న డిజాస్టర్ గానే మిగులుతుంది. అప్పట్లో “వి” “టక్ జగదీష్” సినిమాలు నాని నిరాశపరిస్తే..ఇప్పుడు అదే లిస్ట్ లోకి యాడ్ అయ్యింది..”అంటే సుందరానికి”. వివేక్ ఆత్రేయ తనదైన స్టైల్ లో తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 10న రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టింది.

నిజానికి మొదటి నుండి ఈ సినిమా పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు జనాలు..మలయాళ ఎక్స్ ప్రేషన్స్ క్వీన్ నజ్రియా హీరోయిన్..చాలా మంది మంచి యాక్టర్ ఉన్నారు..డైరెక్టర్ ముందు ట్రాక్ బాగుంది..సో..బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోయినా..యావరేజ్ గా అయిన సినిమా సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు అంతా. కానీ, సినిమా ఆ యావరేజ్ టాక్ కూడా దక్కించుకోలేకపోయింది. దానికి కారణం పవన్ కళ్యాణ్ అంటూ కొందరు పవన్ హేటర్స్ ఆయన ను ట్రోల్ చేశ్తున్నారు.

మనకు తెలిసిందే, అంటే సుందరానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కి గెస్ట్ వచ్చారు పవన్. అందుకే ఈ సినిమా దొబ్బేసిందనేది ఓ బ్యాచ్ వాదన. గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ “రిపబ్లిక్” సినిమాకి ఇలానే గెస్ట్ గా వెళ్ళారు. అయితే, సినిమా గురించి కన్నా ఆయన ఎక్కువ రాజకీయాల గురించే మాట్లాడారు ఫంక్షన్ లో అన్న మాటలు వినిపించాయి. ఇక ఆ సినిమా ఇచ్చిన రిజల్ట్ ఎలాంటిదో మనకు తెలిసిందే. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని అప్లై చేస్తూ..నాని సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం పవన్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి చూడాలి దీని పై పవన్ టీం ఎలా స్పందిస్తుందో..?

Share post:

Popular