త్రివిక్రమ్ కు ఆ తెలివి లేదా..ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన బీహేవీయర్..?

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనీవాస్ అంటే ఇండస్ట్రీలో అదో తెలియని గౌరవం. ఆయన రాసే డైలాగ్ ల్లో నిజాయితీ, పంచ్ పవర్, ఫన్నీ నెస్ అన్నీ కుర్రాళ్లను బాగా ఆకట్టుకుంటాయి. కుర్రాళ్లనే కాదు..జనాభా కూడా అమితంగా ఇష్టపడుతారు. ఎందరో హీరోలకి ఈయన రాసిన డైలాగ్స్ బ్రేక్ ఇచ్చాయి. సినిమా లు మంచిగా హిట్ అయాయి. అయితే, త్రివిక్రమ్ లో ఎంత టాలెంట్ ఉన్నా..కేవలం ఇద్దరు ముగ్గురు హీరోలనే పట్టుకుని తిరగటం..ఇందస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

మనకు తెలిసిందే ఇండస్ట్రీలో త్రివిక్రమ్ ఫ్రెండ్ అనగానే గుర్తు వచ్చేది హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అబ్బో..వీళ్లు ఫ్రెండ్స్ కాదు..అంతకు మించి.. ఓ గొప్ప బంధం. కనీసం కుటుంబం మాటలు కూడా వినని పవన్..త్రివిక్రమ్ చెప్పితే మాత్రం ఇట్టే వినేస్తాడట. అంత మాయ చేశాడు మాటల మాంత్రికుడు. ఇప్పటికే వీళ్ల కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే. మంచి క్రేజ్ ఏర్పడింది.

అయితే ప్రస్తుతం పవన్ వరుస సినిమాలకు సైన్ చేసి ఉన్నాడు. రీసెంట్ గా పవన్ కల్యాణ్ మరో రీమేక్ కు ఓకే చేసిన విషయం తెలిసిందే. తమిళంలో నటుడు సముద్రఖని నటించి తెరకెక్కించిన మూవీ వినోదాయ సితంసినిమాను తెలుగులో పవన్ నటిస్తున్నాడట. ఈ మూవీని సముద్రఖని డైరెక్ట్ చేస్తుండగా కీలక పాత్రలో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే రీసెంట్ గా గుట్టుచప్పుడు కాకుండా పూజా కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్న ఈ సినిమాకు ..డైరెక్టర్ సముద్రఖనినే అయినా..సేమ్ భింలా నాయక్ మాదిరిగానే..కర్త కర్మ క్రియ అన్ని తానై చూసుకుంటున్నాడట. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం పవన్ కోసం ఇంత లా తన జీవితాని అంకితం చేయాలా..అంటూ త్రివిక్రమ అభిమానులు మండిపడుతున్నారు. పేరుకి డైరెక్టర్ సముద్రఖనినే కానీ పెత్తనం మొత్తం త్రివిక్రమ్ దే అని తెలుస్తోంది. త్రివిక్రమ్ కి ఓ లైఫ్ ఉందని..వ్యక్తిగత స్వార్ధం ఉండాలి అనే తెలివి గురూజీకి లేదా..అంటూ కొందరు ఫైర్ అవుతున్నారు. మరి చూడాలి త్రివిక్రమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..?

Share post:

Popular