సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ క్రేజ్ తగ్గని స్టార్ హీరోయిన్లు… ఇంత అరాచ‌క‌మా…!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఒకటి రెండు సంవత్సరాలకే ఫేడవుట్ అవుతూ ఉంటారు . కానీ మరికొంతమంది రోజురోజుకు తమ అందంలో మార్పులు చేసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతున్నారు అని చెప్పడంలో..ఇప్పుడు చెప్పబోయే కొంతమంది హీరోయిన్ లే చక్కటి నిదర్శనం అని చెప్పవచ్చు. ఇకపోతే అలనాటి ఎంతో మంది తారలు అందం , అద్భుతమైన నటనతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత తెరమరుగైన వారు చాలా మందే ఉన్నారు.

కానీ మళ్లీ తమలో ఉన్న ప్రతిభను నిరూపించుకోవడానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి కూడా మంచి క్రేజ్ తో దూసుకుపోతున్నారు అని చెప్పడంలో సందేహం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అంతే హవాతో దూసుకుపోతున్న ఈ సీనియర్ హీరోయిన్ లు ఎవరంటే భూమిక, సిమ్రాన్, ప్రియమణి, ఆమని , ఈశ్వరీ రావు వంటి ఎంతోమంది సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకు పోతున్నారు. ఇకపోతే ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తల్లి , అక్క, వదిన , అత్త పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

బద్రి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రేణుదేశాయ్ చాలా కాలం తర్వాత రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రం ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. మీరా జాస్మిన్.. సుమారుగా నాలుగు పదుల వయసు మీద పడ్డా.. క్లీవేజ్ గ్లామర్ షో ఇస్తూ సోషల్ మీడియా లో మంట పెడుతున్న ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నం చేస్తోంది. ఇక వీరే కాకుండా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈమె సోగ్గాడే చిన్నినాయన, బాహుబలి, బంగార్రాజు అంటూ వరుస సినిమాలతో దూసుకుపోతూ అప్పటి పూర్వవైభవాన్ని సొంతం చేసుకుంది. ఇక అమల , ఇంద్రజ , విజయశాంతి కూడా తల్లి పాత్రల ద్వారా మరోసారి ఇండస్ట్రీ లో కొనసాగుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక మొత్తంగా చెప్పాలంటే వీరంతా గతంలో ఎంతటి ఇమేజ్ ను అయితే సొంతం చేసుకున్నారో.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అంతకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకోవడం గమనార్హం.

Share post:

Popular