సినిమా ఆపేయాలని గవర్నర్ వార్నింగ్.. ప్రేమికులు సినిమా గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు

సినిమా తీయడం అంటే సాధారణమైన విషయం కాదు.. హీరో, హీరోయిన్, నటీనటులను ఎంపిక చేయడం దగ్గర నుంచి… సినిమా మేకింగ్, థియేటర్లలో సినిమా రిలీజ్ చేసేంతవరకు అనేక అడ్డంకులు ఉంటాయి. చివరికి థియేటర్లలో రిలీజ్ చేసిన తర్వాత సినిమా టాక్ వచ్చేంత వరకు సినిమా యూనిట్ లో టెన్షన్ ఉంటుంది. సినిమా ప్లాప్ అయితే తర్వాతి సినిమాను జాగ్రత్తగా తీయడం, హిట్ అయితే నెక్ట్స్ సినిమా కూడా హిట్ కొట్టి టాప్ పొజిషన్ కు చేరుకోవడం లాంటివి అనేకం ఉంటాయి.

అయితే సినిమాల మేకింగ్ విషయంలో వివాదాలు కూడా తలెత్తుతూ ఉంటాయి. కోర్టుల వరకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. వివాదాస్పద సినిమాలు చేసేటప్పుడు కోర్టు చిక్కులు మరింతగా ఉంటాయి. ఇక సినిమాలు రిలీజ్ అయిన తర్వాత కొన్ని సీన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొంతమంది కోర్టుకు వెళుతూ ఉంటారు. ఇలాంటి సమయాల్లో కూడా కోర్టు కేసులు ఎదుర్కొని కొన్ని సీన్లను తొలగించాల్సి వస్తుంది.

ఇలాంటి చిక్కులే ప్రభుదేవా-శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ప్రేమికుడు సినిమాకు ఎదురయ్యాయి. ఈ సినిమాలో గవర్నర్ కూతురిని హీరో ప్రేమిస్తాడని, ఇది నచ్చని గవర్నర్ అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తారనే కథకు సంబంధించిన విషయం బయటకు లీక్ అయింది. దీంతో అప్పట్లో తమిళనాడు గవర్నర్ గా ఉన్న చెన్నారెడ్డి సినిమాను ఆపేసి గవర్నర్ కు సంబంధించిన వివాదాస్పద సీన్లను తొలగించాల్సిందిగా సినిమా యూనిట్ కు వార్నింగ్ ఇచ్చారు.

సినిమా నిర్మాత కుంజుమన్ కు గవర్నర్ కార్యాలయం నుంచి బెదిరింపులు వెళ్లాయట. దీంతో ఈ విషయాన్ని అప్పటి సీఎం జయలలిత దృష్టికి నిర్మాత కుంజుమన్ తీసుకెళ్లగా.. సినిమాలో గవర్నర్ కు సంబంధించి ఎలాంటి వివాదాస్పద సీన్లు లేకుండా తీసుకోవాలని అనుమతి ఇచ్చారు. ఇలా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న తర్వాత ప్రేమికుడు సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించింది.