న‌లుగురు స్టార్ల‌తో 4 సార్లు ప్రేమ‌లో మోస‌పోయిన న‌గ్మా…!

సీనియర్ హీరోయిన్ న‌గ్మా పరిచయం అక్కర్లేదు. 25 డిసెంబ‌ర్‌, 1974వ సంవత్సరంలో ముంబైలో జ‌న్మించింది. మొదట మోడ‌ల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన న‌గ్మా ఆ త‌ర్వాత కాలంలో బాలీవుడ్‌లో ప‌లు సినిమాలు చేసి, సౌత్ వైపు వచ్చింది. ఇక్కడ కూడా తన సత్తాని చాటింది. న‌గ్మాని అప్పట్లో అరేబియ‌న్ గుర్రం అని అనేవారు. ఎందుకంటే ఆమె నడక అంత ఠీవిగా ఉండేది మరి. అందం, అభిన‌యం, స్టైల్ నగ్మా సొంతం. అందుకే అవకాశాలు ఆమె కాళ్ళముందు వచ్చి వాలేవి. ముఖ్యంగా పొగ‌రుబోతు పాత్రలలో ఆమె మెప్పించేది. ఇక 48 సంవ‌త్స‌రాలు వ‌చ్చినా న‌గ్మా ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం.

ఈ విషయంలో అనేక రూమర్స్ నడిచినా, ఆమె 4 ప్రేమ కహానీలు మాత్రం వాస్తవమే. న‌గ్మా వ్య‌క్తిగ‌త జీవితం విఫ‌ల‌మ‌వ్వ‌డానికి ఆమె గుడ్డిగా న‌మ్మిన వాళ్లు మోసం చేయ‌డ‌మే అని సినిమా పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. న‌గ్మా ఒక్కసారి, రెండు సార్లు కాదు.. ఏకంగా 4 సార్లు ప్రేమలో పడి, వారితో డేటింగ్ చేసి కూడా వివాహానికి చేరువకాలేకపోయింది.

ఇందులో ముందుగా న‌గ్మా కోలీవుడ్ సీనియ‌ర్ హీరో శ‌ర‌త్‌కుమార్‌ను ప్రేమించింది. అప్ప‌టికే ఆయ‌న‌కు పెళ్ల‌య్యి పిల్ల‌లు కూడా ఉండటం కొసమెరుపు. ఆ తరువాత కొన్నాళ్ల‌కు వారి రిలేషన్ బెడిసి కొట్టడంతో భోజ్‌పురి హీరోలు అయినటువంటి మ‌నోజ్‌తివారి, ర‌వికిష‌న్ సింగ్‌తో వరుసగా ఒకరి తరువాత ఒకరితో ప్రేమ‌లో ప‌డింది. వారితో కూడా ఆమె రిలేషన్ ముందుకు సాగలేదు. ఇక చివ‌ర‌గా న‌గ్మా భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ అయినటువంటి సౌవ‌ర్ గంగూలీతో ప్రేమ‌లో ప‌డింది.

అప్ప‌ట్లో గంగూలీ మంచి స్టార్ క్రికెట‌ర్‌. ఓ సమయంలో ఆమె మాయలో పడి క్రికెట్ ని సరిగ్గా ఆడటం లేదు అనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో శ్రీకాళ‌హ‌స్తిలో ర‌హ‌స్యంగా న‌గ్మా – గంగూలీ పూజ‌లు చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. త‌ర్వాత గంగూలీ మ‌న‌స్సు మార్చుకుని భార్య‌కు ద‌గ్గ‌ర‌వ్వ‌డంతో న‌గ్మా మ‌ళ్లీ ఒంట‌రిది అయిపోయింది. ఈ రకంగా ఇప్ప‌ట‌కీ ఆమె పెళ్లికి దూరంగా అలాగే ఉండిపోయింది.

Share post:

Popular