“అంటే సుందరానికి”..: హిట్టా..ఫట్టా..?

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రీసెంట్ చిత్రం..”అంటే సుందరానికి”. వివేక్‌ ఆత్రేయ లాంటి ఫీల్ గుడ్ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ మూవీ..నేడు ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే సినిమా టాక్ బయటకు వచ్చేసింది. సినిమా చూసిన జనాలు ఇచ్చే రివ్యూ బట్టి చూస్తుంటే..” అంటే సుందరానికి..” సినిమా హిట్ కొట్టిన్నట్లే అని చెప్పవచ్చు. ప్యూర్‌ కామెడీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్‌ అమ్మాయిగా నటించింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫిస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో నాని ఖాతాలో మరో హిట్ పడ్డిన్నట్లైంది.

సినిమా కి మెయిన్ ప్లస్ కధనే అంటున్నారు జనాలు. ఇద్దరు ఇంటర్ క్యాస్ట్ అమ్మాయి..అబ్బాయి ప్రేమించుకుంటే..వాళ్ళ ఇళ్లల్లోని వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు..ఆ ఏజ్ లో అమ్మాయి, అబ్బాయి ఎలాంటి తప్పులు చేస్తారు..వాళ్ళ పెళ్ళి కోసం ఆడిన అబ్బధాలు లాస్ట్ కి ఎలా వాళ్ల కొంప మునిగి..చిక్కుల్లో పడతారు..అనే స్టోరీని..డైరెక్టర్ వివేక్ ఆత్రేయ చాలా చక్కగా తేరకెక్కించాడు. ఈ సినిమాలో ముఖ్యంగా నాని, నజ్రీయ మధ్య వచ్చే సీన్స్ టూ ఫన్నీ గా ఉంటాయి. మెయిన్ గా నజ్రియా నటన సినిమాను మరో మెట్టు ఎక్కించింది.

ఫ్రెష్ లుక్స్ లో ఈ మలయాళి బ్యూటీ..తెలుగులోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాలో ఉన్న అందరి నటీనటులను..నదియా, నరేష్, రోహిణి ..డైరెక్టర్ చక్కగా వాడుకున్నారు. స్పెషల్ రోల్ లో మెరిసిన అనుపమ పరమేశ్వరన్..సినిమాకి మరో ప్లస్ పాయింట్ గా మారింది. టోటల్ గా సినిమా ఫస్ట్ హాఫ్ స్లోగా సాగినా..సెకండ్ హాఫ్ లో మాత్రం..కేకపెట్టించాడు. సినిమా అన్ని విధాలా బాగున్నప్పటికి ..ఇది నాని రేంజ్ స్టోరీ కాదు అని అంటున్నారు కొందరు జనాలు. సినిమా స్టోరీ పరంగా ఓకే..కానీ, నాని రేంజ్ తో కంపేర్ చేస్తే ..కొంచెం డిసప్పాయింట్ అవుతాం. మనం నానిని దృష్టిలో పెట్టుకోకుండా .. సినిమా ని ఎంజాయ్ చేయడానికి అయితే..హ్యాపీ వెళ్లి సినిమా చూసెయ్యచ్చు . సో..జనాల రివ్యూ బట్టి “అంటే సుందరానికి”..హిట్ పడ్డిన్నట్లే..!!