ఎన్టీఆర్ పాట పాడాడంటే ఆల్బ‌మ్ సూప‌రే… క్రెడిట్ వాళ్ల‌కే ఇచ్చేస్తాడు…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడు చూసినా రెట్టింపు ఉత్సాహంతోనే కనిపిస్తారు. వెయ్యి ఏనుగుల బలం ఉన్న వాడిలా తారక్ హై ఓల్టేజ్ ట్రాన్స్‌ఫార్మర్‌గా కనిపించడం తారక్ స్పెషాలిటీ. అందుకే, మన దర్శకనిర్మాతలు ఆయనతో ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అని డేట్స్ కోసం ఎదురుచూస్తుంటారు. ఎన్టీఆర్ ఒకసారి మాటిస్తే ఆ మేకర్స్‌కు సినిమా చేసి పెడతారు. ఎవరైనా వచ్చి సినిమా చేద్దాం బాబూ అంటే ముందు వచ్చే మాట రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు అని కాదు..ఓకే చేద్దాం అండీ అని. ఆ తర్వాతే కథ, మిగతా విషయాలు..చర్చకు వస్తాయి.

ఫైనల్‌గానే రెమ్యునరేషన్ విషయం చర్చకు వస్తుంది. ప్రస్తుతం తారక్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ సినిమాకు 50 కోట్లు అని సమాచారం. మిగతా హీరోల మాదిరిగా సినిమా హిట్ అయితే, లాభాలలో వాటా అడగడం ఇప్పటి వరకూ ఏ సినిమా విషయంలోనూ జరగలేదనే చెప్పాలి. అదే తను నటించిన సినిమా గనక ఫ్లాపయితే, తీసుకున్న రెమ్యునరేషన్ తిరిగిచ్చేయడానికి అసలు వెనకాడడు.

ఎందుకంటే సినిమాకు నిర్మాతే ముఖ్యం. ఆయన నష్టపోతే కొన్ని వందల కుటుంబాలకు ఉపాధి లేకుండా పోతుంది. ఇదే తారక్ తన సినిమా నష్టపోతే తీసుకున్న రెమ్యునరేషన్ తిరిగిచ్చేయడానికి కారణం. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాట పాడాడంటే ఆ సినిమా ఆల్బం సూపర్ హిట్ అవ్వాల్సిందే. సినిమాలో ఓ పాటకు సాహిత్యం రాసేటపుడే ఇది తారక్‌తో పాడిస్తే సాంగ్ సూపర్ హిట్ అవుతుందని రచయిత – సంగీత దర్శకుడు, దర్శకనిర్మాతలు నమ్మకంగా భావిస్తారు.

ఇదే తారక్‌తో చెబితే అబ్బే ఇది నాతో ఎందుకుండీ.. అనడు..అలాగే పాడేద్దాం అని రెడీ అయిపోతారు. అంతేకాదు, మొత్తం పాట లిరిక్స్ బాగా కంఠత పట్టి..పెట్టాల్సిన ఎఫర్ట్ కంటే రెండింతలు పెట్టి సూపర్ అని అందరూ మెచ్చుకునేలా పాట పాడి ఎంజాయ్ చేస్తారు. తారక్ పాట పాడేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారో యూట్యూబ్‌లో ఉన్న కొన్ని వీడియోలు చూస్తే అర్థమవుతుంది. నాన్నకు ప్రేమతో, రభస లాంటి సినిమాలలోని పాటలు ఎప్పుడూ మోగుతూనే ఉంటాయి. ఇక తారక్ కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్‌కు పాట పాడిన సందర్భం ఉంది.

Share post:

Popular