దివ్యవాణి సినిమాల నుంచి తప్పుకోవడానికి కారణం ఆ హీరో నేనా..?

దివ్యవాణి.. చూడ చక్కని అందం.. చూపరులను ఆకట్టుకునే నటనతో ఎంతో మంది ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న ఏకైక సుందరి దివ్యవాణి అని చెప్పవచ్చు. ముఖ్యంగా బాపు బొమ్మ గీస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి సజీవ సాక్ష్యం దివ్యవాణి.. దివ్యవాణి ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం కూడా ఆమెకు ఉన్న జడ అని చెప్పవచ్చు. వినడానికి కొంచెం విడ్డూరంగా అనిపించినా ఎన్నోసార్లు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఎన్నో సినిమాలలో గొప్ప ఇమేజ్ ను సొంతం చేసుకున్న దివ్యవాణి గత కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో కనుమరుగైపోయింది. ఇక ఆమె సినీ ఇండస్ట్రీ ని విడిచి వెళ్లి పోవడానికి కారణం ఆమెతో కలిసి ఎక్కువ సినిమాలు చేసిన హీరో నే అంటూ చాలా పుకార్లు కూడా వచ్చాయి.

ఇక మొదట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన దివ్యవాణి ఆ తర్వాత మొదటిసారి డాన్స్ రాజా డాన్స్ కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో ఆమె తన మొదటి చిత్రం అయిన పెళ్లి పుస్తకం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక ఈ సినిమాలో తనకు మంచి పేరు వచ్చిందని చెప్పవచ్చు. అదే సమయంలో ఒక చిక్కు కూడా వచ్చి పడింది. ఇకపోతే ఈ సినిమాలు చేసిన హీరో తో అనేక సినిమాలలో చేసింది. ఇక ఆ హీరో కారణంగానే ఆమె అంచెలంచెలుగా ఎదగాల్సింది కాస్త అవకాశాలు తగ్గుముఖం పట్టినట్లు చెబుతుంటారు.

ఇక ఈమె క్రేజ్ తగ్గిపోవడానికి కారణం కూడా ఆ సహానటుడే అని చెబుతూ ఉంటారు. నిజానికి దివ్యవాణి దాదాపు తెలుగు చిత్రసీమ నుంచి దూరమవుతూ తెలుగు, తమిళ, కన్నడ ,మలయాళ భాషల్లో 40 సినిమాల వరకు మాత్రమే హీరోయిన్ గా నటించింది. ఇక ఆ తర్వాత కాలంలో కాలక్రమేణా తన కెరియర్ ముందుకు సాగకపోవడంతో రాజకీయ రంగం వైపు అడుగులు వేసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తన కెరీర్ నాశనం అవ్వడానికి కూడా కారణం ఆ సహానటుడే నట. ఇక తనకు తాను లక్కీ హ్యాండ్ అని చెప్పుకునే ఈ కామెడీ హీరో దివ్యవాణి పాలిట మాత్రం యమకింకరుడు మారిపోయారు. అతడు పెట్టే హింసలు ఆమె తట్టుకోలేక నరకం అనుభవించిందట.అలా సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Share post:

Popular