అందంగా లేవని ఆ హీరోయిన్ ను ఎగతాళి చేశారు… కానీ ?

టాలీవుడ్ లో ఎందరో హీరోయిన్ లు వచ్చి తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని తమ ఫ్యాన్స్ గా మార్చుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు అలా ప్రజల మనసులో ఒక మంచి నటి మరియు పద్దతి కలిగిన హీరోయిన్ లు అని అనిపించుకుంది చాలా తక్కువ మంది మాత్రమే. వారిలో ఒకరే ప్రముఖ నటి ఆమని… ఈమె అంటే ఇష్టపడని కుటుంబ ప్రేక్షకులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతలా తన యొక్క నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈమె నటించిన సినిమాలు అన్నీ హిట్ అయినవే.. తెలుగు సినిమా పరిశ్రమకు ఆమని జంబలకిడిపంబ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుంది అనేది తెలిసిందే. ఇలా ఈ సినిమా విజయంతో ఆమనికి వరుస ఆఫర్ లు అందుకుంది. ఆమని జగపతిబాబుతో కలిసి చేసిన శుభలగ్నం ఇండస్ట్రీ హిట్ అయింది.

ఇక మిస్టర్ పెళ్ళాం సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకుని ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో స్థిరపడింది. అయితే ఆ తర్వాత కొన్ని సినిమాల చేసి ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. అయితే ఏ హీరోయిన్ కి అయినా కూడా వయసు అయిపోయాక హీరోయిన్ గా కెరీర్ అంతం అయినట్లే లెక్క. అలాగే ఆమని కూడా హీరోయినే గా తన కెరీర్ ముగిసిపోయింది. కానీ ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ను తల్లి గా స్టార్ట్ చేసింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ మంచి టచ్ లో ఉంది ఆమని. ఇదిలా ఉంటే … తాజాగా అమని మరియు ఇంకో మాజీ హీరోయిన్ ఇంద్రజాల కలిసి ఈటీవీ లో ఆలీ యాంకర్ గా వ్యవహరిస్తున్న అలీ తో సరదాగా అనే షోకి వచ్చారు. ఇందులో ఆమని ఇండస్ట్రీ మొదటి రోజుల్లో ఎటువంటి చేదు అనుభవాలను ఎదుర్కొంది అన్నది ఇక్కడ షో ద్వారా ప్రేక్షకులలో పంచుకుంది. ఇదంతా కూడా ఈ షో ప్రోమో విడుదల కావడంతో అందరికీ తెలిసింది.

ఆమనికి దొంగతనంగా మామిడి కాయలు కోసుకుని తినడం బాగా ఇష్టమట… అంతే కాకుండా ఆమనికి సినిమాలు అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. ఆనాడు శ్రీదేవి జయసుధ, జయప్రద లాంటి స్టార్ హీరోయిన్ లు నటన చూసి సినిమాలపై ఇష్టం పెరిగిందట. అదే ఇష్టం ఆమె పెద్ద అయ్యాక మరింత బలపడింది అని తెలిపింది. ఎలాగైనా సినిమాలలో హీరోయిన్ గా నటించాలని మనసులో గట్టిగా అనుకుందట. అయితే ఏ విషయం అయినా ఫ్యామిలీకి మొదట చెప్పాలి.. కాబట్టి ఆమని కూడా తన ఇంట్లో చెప్పడంతో వారు ఈమెను చూసి హేళనగా .. నువ్వు హీరోయిన్ వి అవుతావా అంటూ తనను వెనక్కు లాగే ప్రయత్నం చేశారట. అంతే కాకుండా ఆమని ని ఉద్దేశించి నీకు మాట్లాడడం రాదు… ఇక ఎలా నటిస్తావు అంటూ కనీసం పెద్ద అందం కూడా లేదు అని మనసును నొప్పించారట. అయితే ఇంట్లో వారి మాటలకు ఆమని మాత్రం చాలా బాధపడింది అని షో ద్వారా తెలియచేసింది. అలా తన బాధను అలీ తో సరదాగా అనే షో లో పంచుకుంది సీనియర్ నటి ఆమని.

Share post:

Popular