వామ్మో.. బిత్తిరి సత్తి ఈ రేంజ్ లో సంపాదిస్తున్నాడా..?

బిత్తిరి సత్తి.. ఈ పేరుకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఒక వైపు బుల్లితెరపై మరోవైపు వెండితెరపై కూడా ఆరెంజ్ లో పాపులారిటీ సంపాదించు కున్నాడు. అందుకే ఇప్పుడు ఎవరిని అడిగిన బిత్తిరి సత్తి గురించి ఇట్టే చెప్పేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.. v6 ఛానల్ లో వచ్చిన తీన్మార్ వార్తలు అనే కార్యక్రమం ద్వారా అమాయకుడైన వింత ప్రవర్తన కలిగిన వ్యక్తి గా నటించి ఇక బిత్తిరి సత్తి గా ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారిపోయాడు. ఆ తర్వాత వెండితెరపై కూడా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు.
బిత్తిరి సత్తి పేరడీలకు ఊహించని రేంజిలో స్పందన రావడంతో బిగ్ సెలబ్రిటీ గా మారిపోయాడు అని చెప్పాలి. ప్రస్తుతం బిత్తిరి సత్తి కి ఉన్న పాపులారిటీని చేసుకోవడానికి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్, ఇంకా ఎన్నో టీవీ ఛానల్స్ కూడా ఇక భారీ ఆఫర్లు ఇస్తున్నాయి అని తెలుస్తోంది. v6 ఛానల్ నుంచి టీవీ9 లోకి వచ్చేసాడు బిత్తిరి సత్తి. ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బిత్తిరి సత్తి సంపాదన ఎంత ఉంటుంది అని తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు.
ప్రస్తుతం ఉన్న టాప్ యాంకర్ లతో పోల్చి చూస్తే అటు బిత్తిరిసత్తి ఆదాయం ఎక్కడ తక్కువ కాదు అని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఏకంగా పెద్ద హీరోల సినిమా ఏదైనా విడుదల అవుతుందంటే చాలు బిత్తిరి సత్తి ఒక ఇంటర్వ్యూ తప్పకుండా ఉంటుంది. త్రిబుల్ ఆర్ చిత్రబృందం, మహేష్ బాబు, వెంకటేష్, వరుణ్ తేజ్ లాంటి హీరోలను ఇంటర్వ్యూ చేసే స్థాయికి ఎదిగాడు బిత్తిరి సత్తి. ఇలా ఇంటర్వ్యూలు చేస్తే ఏకంగా ఒక ఇంటర్వ్యూ కి సుమారు రెండు లక్షల తీసుకుంటున్నాడట బిత్తిరిసత్తి. ఇలా ప్రతి నెలకు ఐదు నుంచి ఏడు లక్షల వరకు ఆదాయాన్ని పొందుతున్నాడట. టాప్ యాంకర్ గా ఉన్న సుమా కంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నాడట.. బిత్తిరి సత్తి ఆదాయం గురించి తెలిసి అందరూ షాక్ లో మునిగిపోతున్నారు ఫ్యాన్స్.

Share post:

Popular