హీరోయిన్ ఇంద్రజ భర్త ఎవ‌రు… ల‌వ్ మ్యారేజ్‌లో భ‌లే ట్విస్ట్‌..!

తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ సినిమాలు చేసినా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ప్రముఖ హీరోయిన్ ఇంద్రజ. ఆమె తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన నటి. ఇంద్రజ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. కానీ ఆమె తెలుగులో కన్నా బాలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీ లోనే ఎక్కువ సినిమాలు చేశారు. గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటన విషయంలో ఈ కథ ఇంద్రజకి సరిపోతుంది అనుకుని వచ్చిన వారి దగ్గర నేను నటిస్తున్నాను.

ఇకపోతే కథలు విషయానికి వస్తే నాకు నచ్చితేనే చేస్తాను.. అలా నాకు కథలు నచ్చక చాలా సినిమాలు వదులుకున్నాను. అక్క గాను, వదిన గాను ఇలా ఏ క్యారెక్టర్ అయినా చేయడాని నేను రెడీ.. ఏ క్యారెక్టర్ చేసినా.. ఆ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉండాలని భావిస్తున్నాను. అలాంటి పాత్రలు వస్తే నేను చేస్తాను. ఇకపోతే చెన్నైలో స్థిరపడ్డాను కాబట్టి అక్కడి సినిమాలలో ఎక్కువ నటించాను.

ఇకపోతే శతమానంభవతి మూవీ కి దాదాపు పదిహేను రోజులు రాజమండ్రిలోనే ఉండవలసి వచ్చింది. మా పాపను మా హస్బెండ్ ను మా తండ్రి చూసుకున్నారు. ఇకపోతే నేను బ్రాహ్మిన్స్ కానీ మా ఆయన ముస్లిమ్స్..మతం చూసి , కులం చూసి పెళ్లి చేసుకోవడం అనేది సినిమాల్లో డైలాగ్ లా ఉంటుంది. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ ఉండేవారు. మేము ఫ్రెండ్స్ గా 6 ఇయర్స్ నుంచి కలిసి ఉన్నాం.

అలా ఒకరినొకరు అర్థం చేసుకుని ఇద్దరం పెళ్లి చేసుకున్నాము. ఆయన రైటర్ అండ్ యాడ్ ఫిలిం మేకర్, కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు. ఇవే కాకుండా మాకు ఫామిలీ బిజినెస్ లు కూడా ఉన్నాయి అని చెప్పుకొచ్చింది నటి ఇంద్రజ .తరువాత ఈమె కొన్ని షోల ద్వారా ఇండస్ట్రీ కి రీ ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోల ద్వారా మంచి పేరును గుర్తింపును సంపాదించుకున్నారు ఇంద్రజ.

Share post:

Popular