యు ట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి: ‘వర్మ నాముందు బచ్చాగాడు’ ?

గత వారంలో టాలీవుడ్ లో జరిగిన ఒక వివాదం ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ వివాదం నటి కరాటే కల్యాణికి మరియు యు ట్యూబ్ లో ఫ్రాంక్ విడిలో చేసుకునే శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తికి జరిగిన గొడవ గురించి అందరికీ తెలిసిందే. కళ్యాణి నేరుగా ఇంటికెళ్లి శ్రీకాంత్ రెడ్డిని కొట్టడం బాగా వైరల్ అయింది. దెబ్బలు తగిలితే తగిలాయి కానీ మంచిగా ఫేమ్ తెచ్చుకున్నాడు,. ఇప్పుడు యు ట్యూబర్ ల అందరికీ ఇతను ఒక మార్గదర్శిగా ఉన్నాడు. దీనితో టాలీవుడ్ తో పాటుగా అందరూ కల్యాణిని తప్పుబడుతూ పోస్ట్ లు పెడుతున్నారు. దీనితో శ్రీకాంత్ రెడ్డి ఫేమస్ అయిపోయాడు. అందుకే రోజుకి ఒకొక్కరి గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ లొల్లి చేస్తున్నాడు. అయితే తాజాగా ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కూడా తన దైన రేంజ్ లో రెచ్చిపోయాడు. ఏదో ఒక ఇంటర్వ్యూలో ఎదుటివారు ఇలా వివాదాలు జరుగుతున్నాయి కదా.. నిత్యం వివాదాలలో ఉండే ఆర్జీవీ మీకు స్ఫూర్తా అన్న ప్రశ్నకు.. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్జీవీ నాకు స్ఫూర్తా తొక్కా… నా ముందు వాడు బచ్చాగాడు అంటూ అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు.

మరి ఒక ప్రముఖ డైరెక్టర్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అన్నది ఆలోచించకుండానే మాటలు తూలడం తన అనుభవాన్ని గుర్తు చేస్తుంది. అయితే గతంలో శ్రీకాంత్ రెడ్డి నేను సినిమా పరిశ్రమలోకి రావాలి అనుకోవడానికి ఆర్జీవీ స్ఫూర్తి అని అన్నాడు. అయితే ఇప్పుడు పూర్తిగా తన మాటను మార్చేస్తున్నాడు. అయితే ఇలా మాట్లాడడానికి అతని దగ్గర సాలిడ్ రీజన్ ఉందని చెబుతున్నాడు. ఒకసారి ఆర్జీవీ ని కలవడానికి తన ఆఫీస్ కి వెళ్ళాడట… అయితే తన అసిస్టెంట్ లు మాత్రం తనను ఆర్జీవీ ని కలవనివ్వకుండా మందు బాటిళ్లు తెప్పించుకుని వెనక్కు పంపేశారట. ఇది గమనించిన శ్రీకాంత్ రెడ్డి ఇది మనకు సూట్ అవదని వెనక్కు వచ్చేసి… మొదట అమీర్ పెట్ లో బజ్జీ బండి పెట్టుకున్నాడు. అయితే అక్కడ ఉన్న పక్క పక్కన షాపుల వారు అతన్ని తరిమి కొట్టారు. దీనితో తాను చదివిన చదువును నమ్ముకుని ఒక మెడికల్ షాప్ ను పెట్టుకున్నాడు. అయితే అక్కడ కూడా తనకు కలిసి రాకపోవడంతో ఇక అన్నీ వద్దనుకుని బాగా అలోచించి హైద్రాబాద్ చేరుకున్నాడు. యు ట్యూబ్ లో చిన్న చిన్న వీడియోలు చేయడం మొదలు పెట్టాడు.

అలా ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఫ్రాంక్ వీడియోలు చేసి సినిమా చేసే స్థాయికి ఎదిగాడు. వర్మ గురించి మాట్లాడుతూ ఎప్పుడో హిట్లు తీశాడని ఇప్పటికీ అయన పేరు చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు పెద్ద వాళ్ళ టైం అయిపోయింది. మా యువత అన్ని రంగాలలో ఆకట్టుకుంటున్నారు. వర్మ నాకు ఏకోశానా స్ఫూర్తి కాదు… నా ముందు బచ్చాగాడు కావాలంటే నాతో డిబేట్ లో మాట్లాడమని అంటూ సవాల్ చేశాడు. నేను వీడియోలను చేయడం మాత్రం ఆపాను నన్ను కెలికితే నేను కూడా స్ట్రాంగ్ గా ఇస్తాను వారికి… ఇక తాను తీయబోయే కొత్తపేట గ్రామం అనే సినిమా గురించి చెప్పాడు. ఇందులో సన్నీ లియోన్ ఐటెం సాంగ్ చేస్తోంది అంటూ షాక్ ఇచ్చాడు. ఇక చంద్రబోస్ మరియు కాసర్ల శ్యామ్ పాటలు రాశారని తన సినిమాకు తానే పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు.

Share post:

Popular