‘కరాటే కళ్యాణి – యూ ట్యూబర్ శ్రీకాంత్’ ను కొట్టడం సబబేనా ?

గతంలో అంటే ఇంటర్నెట్ అంతగా వ్యాపించని రోజులలో ఎక్కడ ఏమి జరుగుతుందో అంతగా తెలిసేది కాదు. కానీ నేడు ఇంటర్నెట్ హల్ చల్ ఎక్కువగా ఉంది. అరచేతిలో ఫోన్ పెట్టుకుని ప్రపంచంలో జరిగేది అంతా తెలుసుకోగలుగుతున్నాము. అయితే సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా మంచి కన్నా చెడు జరుగుతోంది… అలాగే అందరికి చెడు అలవాట్లు నేర్చుకోవడానికి ధోహదపడుతోంది అని చెప్పవచ్చు. ఇక యు ట్యూబ్ లో కొత్త కొత్తగా వస్తున్న ఫ్రాంక్ వీడియోల సంగతి అయితే వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఈ ఫ్రాంక్ వీడియోల ద్వారా బాగా ఫేమస్ అయినవాళ్లు ఉన్నారు. అయితే ఎవరూ ఒకరిద్దరో నీతిగా మంచి కంటెంట్ తో ఫ్రాంక్ చేస్తున్నారు. కానీ చాలా వరకు అసభ్యకరమైన కంటెంట్ తోనే వీడియోలు చేస్తూ మహిళలను ఇబ్బంది పెడుతున్నారు. కొందరు అయితే నేరుగా మహిళా దగ్గరకు వెళ్లి సెక్సువల్ గా మాట్లాడడం చూసేవారికి చాలా ఇబ్బందిగా ఉంది.

ఇప్పుడు అదే విధంగా శ్రీకాంత్ అనే యు ట్యూబర్ తన వీడియోల ద్వారా యువతను పాడు చేస్తున్నాను అని చెప్పాలి. యువతలో సెక్స్ కోరికలు కలిగేలా తన మాటలు ఉన్నాయి అంటూ ఇప్పుడు గందరగోళం జరుగుతోంది. అయితే ఎంతోమంది మనము చూస్తున్నా.. ఎవ్వరూ మనసులో తిట్టుకుని కామ్ గా అయిపోతున్నాము. కానీ ఇండస్ట్రీ కి చెందిన నటి కళ్యాణి మరియు కొందరు అనుచరులతో కలిసి శ్రీకాంత్ ఇంటికి వెళ్లి అతనిపై చెయ్యి చేసుకుంది. ఈ విషయంపై అతనిని ఎడాపెడా రప్పాడించింది. నేరుగా అతనిని ఏంటిరా నీ వీడియోలు హిందుత్వాన్ని మంటగలిపేలా ఉన్నాయంటూ దులిపేసింది. ఈ సంఘటన వీడియో రూపంలో వైరల్ కావడంతో అసలు విషయం తెలిసింది. అయితే శ్రీకాంత్ ఏమీ తక్కువ తినలేదు కరాటే కళ్యాణితో సహా వారి మనుషులను ఎదిరించి కొట్టాడు. ఈ కొట్లాటలో కళ్యాణి చేతిలో ఉన్న పసిపిల్లాడు సైతం కిందపడిపోయాడు.

అంతటితో ఆమె లేచి శ్రీకాంత్ ను గుడ్డలూడదీసి కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. కానీ ఇక్కడ శ్రీకాంత్ చెబుతున్న ప్రకారం కరాటే కళ్యాణి తనను వీడియోలు చేయమని అడిగిందట, కానీ అందుకు శ్రీకాంత్ ఒప్పుకోకపోవడంతో ఇలా నాపై దాడి చేసిందని అంటున్నాడు. కానీ కళ్యాణి వెర్సన్ మాత్రం వేరేలా ఉంది. తనను అసభ్యంగా మాట్లాడాడు అని, నా బొడ్డుపై చేయి వేసి తనతో పడుకోమన్నాడు అని చెబుతోంది. అందుకే నేను కొట్టానని మీడియా ముందు చెప్పింది. అయితే ఇక్కడ బాగా పరిశీలించిన అనంతరం తెలుస్తోంది ఏమిటంటే.. కరాటే కళ్యాణికి వ్యక్తిగతంగా అతనిపై ఏమైనా ఇబ్బంది ఉంటే… పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలి అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Share post:

Popular