‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ లో ఈ నటి ఎవరో తెలుసా?

గత వారం రోజుల నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఈ సినిమాలో హీరో మరియు హీరోయిన్ లుగా యంగ్ హీరో విశ్వక్ సేన్ మరియు రుక్సానా థిల్లర్ లు నటించారు. అయితే విశ్వక్ సేన్ సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి సినిమా నేపధ్యం లేకుండా వచ్చి ఇప్పుడు తనకంటూ ఒక మార్కెట్ ను ఏర్పరుచుకున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా విశ్వక్ సేన్ అండ్ టీమ్ చేసిన పని వలన ఎంత రచ్చ అయింది అనేది మనము చూశాము. అయితే ఈ రచ్చ ఇప్పుడు ఈ సినిమాకు ప్లస్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ వివాదం జరగడం వలనే సినిమా గురించి తెలియని వారికి కూడా తెలిసింది అని చిత్ర బృందం కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటోంది.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం నిన్న ఎన్నో అంచనాల మధ్యన రిలీజ్ అయింది. అయితే మొదటి షో నుండే పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుని విశ్వక్ సేన్ కు మరో హిట్ ను అందించింది. ముఖ్యంగా విశ్వక్ సేన్ నటన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలలో విభిన్నంగా అమాయకంగా నటించి అందరి నుండి ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమాలో నటించిన ఒక నటి గురించి ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమె యువకులను ఆకట్టుకుని బాగా పాపులర్ అయింది. ఈమె ఎవరు అంటూ అందరూ ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈమె పేరు రితికా నాయక్ అని తెలుస్తోంది. ఈమె ఈ సినిమాలో నటనకు ఎందరో బాగా అట్రాక్ట్ అవుతున్నారు.

ఇప్పటి వరకు చూస్తే సినిమా పట్ల అందరూ సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్ కెరీర్ లో మరో హిట్ అయితే దక్కింది అని టాక్ బయటకు వచ్చేసింది. దీనితో మూడు రోజుల క్రితం దేవి నాగవల్లికి మరియు విశ్వక్ సేన్ కి జరిగిన వివాదం హైలైట్ అవుతూ ఉంది. ఈమెను ఇంటర్వ్యూ చేసి వివాదం అయితే అది ఖచ్చితంగా హిట్ అవుతుందని వైరల్ అవుతోంది.

Share post:

Latest