అవకాశాలు లేక విదేశాల బాట పట్టిన తెలుగు హీరోయిన్..!!

గత కొన్ని సంవత్సరాల నుంచి వినిపిస్తున్న మాట ఏమిటంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల కు పెద్దగా అవకాశం ఇవ్వడం లేదు అని.. ఇప్పటికే శ్రీ రెడ్డి లాంటి ఎంతో మంది నటీమణులు కూడా రోడ్డెక్కి మరి గళం విప్పారు. అందం , అభినయం, నటన, ప్రతిభ ఇలా అన్నీ కలగలసిన తెలుగు అమ్మాయిలు ఎందుకు ఇండస్ట్రీకి దూరమవుతున్నారు అనే విషయం మాత్రం ఎక్కడ అంతుచిక్కడం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. సినిమాలలో అవకాశాలు రావాలి అంటే కొంచెం గ్లామర్ డోస్ పెంచాల్సిందే. కానీ తెలుగమ్మాయిలు గ్లామర్ పాత్రలకు కొంచెం దూరంగా ఉండడం వల్లే వారికి అవకాశాలు రావడం లేదు అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే సినీ ఇండస్ట్రీ అనేది ఒక పర్మినెంట్ లేని ఉద్యోగం లాంటివి. ఉన్నంతకాలం మాత్రం లగ్జరీ లైఫ్ తో పాటు లక్షల రూపాయల పారితోషకం కూడా ఉంటుంది. ఇక అందుకే అవకాశం ఉన్నప్పుడే జీవితానికి సరిపడా డబ్బులు సంపాదించుకొని లైఫ్ ఎంజాయ్ చేయడానికి రిటైర్ కావడం మరి కొంతమంది అయితే అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమవడం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ కూడా ఈ కోవకు చెందిన వారే. పూర్తి వివరాల్లోకి వెళితే ఐదు సంవత్సరాల క్రితం ఒక తెలుగు సినిమా లో సైడ్ హీరోయిన్ పాత్రలో నటించి తెలుగు ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించింది..

పాత్రకి మంచి స్కోప్ ఉండడం.. అలాగే ఆ హీరోయిన్ కి బాగా కలిసి రావడంతో సైడ్ హీరోయిన్ కాస్త మెయిన్ హీరోయిన్ గా మారిపోయింది. అలా సుమారుగా ఆరు చిత్రాలకు పైగా నటించింది. కానీ ఇందులో ఆమె సినిమాలు హిట్ సాధించిన దాఖలాలు లేవు.అందుకే ఈమెకు పెద్దగా గుర్తింపు లభించడం లేదని చెప్పవచ్చు. డైట్ విషయంలో కొంతమేర అశ్రద్ధ కనిపించడం బరువు బాగా పెరగడంతో.. ఈమెకి సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు రావడం పూర్తిగా తగ్గిపోయాయి. ఇక సినిమా ఆఫర్లు లేకపోవడం వల్ల ఈమె కెరీర్ కూడా దాదాపుగా ముగిసిపోయింది. అందుకే ఈ హీరోయిన్ కాస్త అమెరికాకు వెళ్లి అక్కడే సెటిల్ అయినట్లు తెలుస్తోంది. డబ్బుల్లేక సాఫ్ట్వేర్ రంగంలోని సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తోంది అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Popular