సుధీర్‌కు టాలీవుడ్ హీరోయిన్ కిస్ వెన‌క ఇంత క‌థ ఉందా ?

బుల్లితెరపై ఎంతో మంది నటులు ఉన్నప్పటికీ.. సుడిగాలి సుదీర్ కు ప్రత్యేక మైన స్థానం ఉన్నది. ఇక ఈయన నటుడుగా, యాంకర్ గా, కమెడియన్ గా, మెజీషియన్ గా మంచి పేరు సంపాదించారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక అందుకు సంబంధించి తాజా ప్రోమో కూడా ఒకటి విడుదల అవ్వడం జరిగింది. ఈ షో కి హీరోయిన్ హెబ్బా పటేల్ గెస్ట్ గా హాజరయ్యింది. ఆ షో కి ప్రముఖ నటి ఆమని కూడా జడ్జి గా వ్యవహరిస్తూ ఉన్నది.

ఇక ప్రోమోలో చూపించిన విధంగా సుధీర్ ముందుగా హెబ్బా పటేల్ తో నేను హీరో గా యాక్ట్ చేస్తానని.. మీరు హీరోయిన్ గా యాక్ట్ చేయాలని తెలియజేస్తారు.. అయితే సుధీర్ చెప్పిన మాటలు ఆమెకు అర్థం కాకపోవడంతో హెబ్బా పటేల్ వెరైటీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.. ఇదంతా గమనించిన ఆమని సుదీర్ హెబ్బా పటేల్ కు నచ్చలేదేమో అనుకుంటున్నానని తెలియజేయగా హెబ్బా పటేల్ మాత్రం సుధీర్ అంటే తనకు బాగా నచ్చాడని ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చింది.

ఇక అటు తరువాత హైపర్ ఆది, రాంప్రసాద్ వంటివారు ఎంట్రీ ఇవ్వగా.. సెలబ్రెటీలు హాగ్ ఇవ్వాలని తెలియజేశారు. హెబ్బా పటేల్ ఆదికి హగ్ ఇవ్వగా ఇదంతా చూసిన ప్రేక్షకులు నవ్వు తెప్పించేలా ఎక్స్ప్రెషన్ పెట్టాడు ఆది. దీంతో అక్కడున్న నరేష్ తనకు ఫ్రెండ్లీ హగ్ కావాలని అడగగా హెబ్బా పటేల్ మొహమాటపడకుండా నరేష్ కు కూడా హగ్ ఇచ్చింది. దీంతో ఈ ప్రోమో కి 6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఈనెల 29వ తేదీ ఎపిసోడ్ బుల్లితెరపై ప్రసారం అవుతోంది. అయితే ఈ ప్రేమ చూసిన పలువురు నెటిజెన్స్ సుధీర్ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు ఉంటాయని ప్రోమో సూపర్ గా ఉందని పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక హెబ్బా పటేల్ దాదాపుగా బుల్లితెరపై కనిపించక చాలా సంవత్సరాలు అవుతోంది అని చెప్పవచ్చు. ఇటీవల ఆచార్య సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించే అవకాశం వచ్చినా ఆమె మాత్రం ఒప్పుకోలేదు.

Share post:

Popular