సమంత గురించి తల్లి చేసిన కామెంట్స్ వైరల్ ?

టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ లలో మాజీ అక్కినేని కోడలు సమంత ఒకరు. గతంలో ఈమె నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని మనస్పర్థలు రావడం కారణంగా ఇద్దరూ మాట్లాడుకుని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుండి సమంత తీరులోనే చాలా మార్పు వచ్చింది. వరుసగా ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లంటూ అవకాశాలు అందుకుంటూ దూసుకువెళుతోంది. ఈ ముద్దుగుమ్మ ఒకవైపు సినిమాలు మరో వైపు వాణిజ్య ప్రకటనలు, స్పెషల్ సాంగ్స్ అంటూ రెండు చేతులా బాగానే సంపాదిస్తోంది. అందరిలాగే సమంత కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ తన అభిమానులకు తన గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది.

అయితే ఈ మధ్య సమంత తన హాట్ హాట్ ఫోటోలు మరియు వీడియో లతో కుర్ర కారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. కొన్ని సార్లు ఈమె పోస్ట్ చేసే ఫోటోలు వివాదాలుగా కూడా మారుతుంటాయి. అయితే వివాదాలు తనకు ఏమీ కొత్త కాదు కాబట్టి అంతగా పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటుంది. అయితే సమంత ఇప్పుడున్న స్థితికి మరియు పెళ్ళికి ముందు కానీ ఇలా ఉండేది కాదు. అంతే కాకుండా తన సినిమాలలోనూ ఇంతలా అందాల ప్రదర్శన చేసినా తన హద్దుల్లోనే ఉంటూ వచ్చింది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత అయితే మరీ గౌరవంగా సినిమాల మీదనే దృష్టి పెట్టి కుటుంబం పైనే ఎక్కువా గౌరవం మరియు ఇష్టాన్ని పెంచుకుంది. కానీ పెళ్లి తర్వాత చేసినా ఒక వెబ్ సిరీస్ తాను ఈ రోజు చైతన్యతో విడిపోవడానికి కారణం అని పుకార్లు వచ్చాయి.

ఈ సీజన్ లో తన నటన మరీ హద్దులు దాటిందని విమర్శలు వచ్చాయి. అయితే ఒక్కసారిగా విడాకుల అనంతరం మాత్రం అందాల విందుకు అడ్డు తొలగింది అన్నట్లుగా తన పోస్ట్ లు ఉండడం అటు నాగచైతన్యతో పాటు పలువురు ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతోంది అని చెప్పాలి. కానీ వీటన్నింటికీ కారణం సమంత తన వ్యక్తిగత జీవితాన్ని మరిచిపోయి సినిమాలతో బిజీగా ఉండడానికి ఇలా చేస్తోందని ప్రేక్షకులు అంటున్నారు. ఇక ఈ హాట్ పోజుల విషయానికి వస్తే ఆమాత్రం చొరవ తీసుకోకపోతే… ఇప్పుడిప్పుడే వస్తున్న యంగ్ హీరోయిన్లు తమ స్థానాన్ని లాగేసుకుంటారని భయపడుతోందని అందుకే విచ్చలవిడిగా అందాల ప్రదర్శన చేస్తోందట. కానీ ఈ విషయాన్ని సమంత బంధువులు తన తల్లిని ప్రశ్నించగా… ఆమె వారికి సరైన సంధానం ఇచ్చిందట. ఇందుకు సమంత తల్లి, సమంత ఏమి చేసినా అన్ని విషయాలు ఆలోచించే చేస్తుంది. తాను తీసుకునే ప్రతి నిర్ణయం గురించి మాకు నమ్మకం ఉంది అంటూ తెలిపింది. నా బిడ్డ మా పరువు తీసే పని ఎప్పుడూ చేయదని తెలిపింది. దీనితో అందరి నోళ్లు మూతబడ్డాయి.

Share post:

Popular