శేఖర్ ట్రైలర్ టాక్: రాజశేఖర్ హిట్ కొట్టేలా ఉన్నాడుగా!

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శేఖర్’ నిజానికి ఎప్పుడో పూర్తయ్యి రిలీజ్ కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా వాయిదాలు పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమాను పూర్తి చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. శేఖర్ చిత్ర ట్రైలర్ ఒక మిస్టరీ థ్రిల్లర్‌గా మనల్ని ఎంటర్‌టైన్ చేస్తుంది.

ఈ సినిమాలో రిటైర్ అయిన ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాజశేఖర్ మాస్ లుక్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఇక తెల్లటి గడ్డంతో ఆయన లుక్స్ సినిమాకే హైలైట్‌గా కనబడుతున్నాయి. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ రియల్ డాటర్ శివాత్మిక రాజశేఖర్ కూడా ఈ సినిమాలో నటిస్తుండటంతో వారిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. తన భార్య యాక్సిడెంట్‌కు సంబంధించిన కేసును ఇన్వెస్టిగేట్ చేసే పాత్రలో రాజశేఖర్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

శేఖర్ సినిమాలో రాజశేఖర్ కోసం మరోసారి డైలాగ్ కింగ్ సాయి కుమార్ తన వాయిస్‌ను ఇచ్చాడు. జీవితా రాజశేఖర్ తనదైన టేకింగ్‌తో ఈ సినిమా ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దినట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి శేఖర్ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Popular