F3 సినిమాలో పవన్ కల్యాణ్..క్రేజీ మ్యాటర్ లీక్ చేసిన దిల్ రాజు..!!

టాలీవుడ్ స్టార్ సినియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్..కుర్ర హీరో వరుణ్ తేజ్..కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ F3. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా మరి కొద్ది గంటల్లోనే అభిమానుల ముందుకు రానుంది. రేపు అనగా మే 27 న ఈ సినిమా గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ధియేటర్స్ వద్ద సందడి మొదలైంది. హీరో ఫ్లెక్సీల తో పాటు..డైరెక్టర్ అనిల్ ఫ్లెక్సీలు కూడా పెట్టి..అభిమానులు నానా హంగామ చేస్తున్నారు.

కాగా, ఈ సినిమాలో హీరోయిన్లు గా తమన్నా, మెహ్రీన్ లు నటిస్తుండగా..కీలక రోల్ లో సోనాలీ చౌహాన్..ఐటెం సాంగ్ లో పూజా హెగ్డే నటించారు. ఇంత మంది తారలు ఉన్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ అంచనాలను డబుల్ చేస్తూ..చిత్ర నిర్మాత దిల్ రాజు..సెన్సేషనల్ న్యూస్ ని లీక్ చేశారు. ఈ సినిమాలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా నటించారని చెప్పుకొచ్చారు.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ..సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్ రివీల్ చేసారు. ఈ సినిమా పూర్తిగా కామెడీ నేపధ్యంలో తెరకెక్కిందని..చిన్న పెద్ద అందరు కలిసి చూసి హ్యాపీ గా ఎంజాయ్ చేయచ్చు అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ పిల్లలికి బాగా కనెక్ట్ అవుతాయని చెప్పిన ఆయన సినిమాలో ఊహించని సర్ప్రైజెస్ ఉన్నాయని..ఈ సినిమాలో పవన్ తో పాటు మరికొందరు స్టార్స్ ని కూడా మీరు చూస్తారంటూ..అభిమానుల అంచనాలను పెంచేశారు. మరి చూడాలి..అనిల్ ఎలా తెరకెక్కించాడో..?

Share post:

Popular