నాగచైతన్య ఇంప్రెస్.. రూట్ మార్చాడురోయ్..!!

అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగ చైతన్య కెరీర్ లో మొదటి హిట్ కొట్టడానికి పెద్దగా ఇబ్బంది పడలేదు కానీ..వచ్చిన సక్సెస్ ఫాం ని ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయాడు. సినిమాలు ఎలాంటివి చూస్ చేసుకోవాలో తెలియక కొన్ని..కధను నమ్మి బోల్తా కొట్టిన సినిమాలు కొన్ని..ఇలా ఖాతాలో చాలానే ఫ్లాప్ సినిమాలు వేసుకున్నాదు. నిజం చెప్పాలంటే కెరీర్ లో హిట్లకన్నా కూడా ఫ్లాప్ లే ఎక్కువ ఉన్నాయి.

ఇక ఎవ్వరు ఊహించని విధంగా స్టార్ హీరోయిన్ సమంత ను పెళ్ళాడిన ఈయన..ఆ తరువాత ఆ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందరు సమంత భర్త అన్నారే తప్పిస్తే..నాగ చైతన్య భార్య అని అనలేదు. అక్కినేని ఇంటి కోడలు అంటూ ఓ ట్యాగ్ తగిలించారు. కొంత కాలం సినీ ఇండస్ట్రీలో ఈ భార్యభర్తల పేర్లు మారుమ్రోగిపోయాయి. సినిమా పరంగా కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు. లోపల ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ..విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యి..ఎవరి దారిలో వాళ్లు వెళ్తున్నారు.

కాగా, విడాకుల తరువాత నాగ చైతన్య నటించిన బంగార్రాజు సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక ప్రజెంట్ నాగ చైతన్య నటించిన ధ్యాంక్యూ సినిమా షూటింగ్ దశలో ఉంది. లాల్ సింగ్ చద్దాలో కీలక పాత్ర పోషించాడు. ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా నాగచైతన్య బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో ఓ సినిమాకి కమిట్ అయ్యాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తమ్ముడు అఖిల్ కు ఫస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ పర్ ఫామెన్స్ కి ఇంప్రెస్ అయిన ఈయన..కధ కొత్త గా ఉండటంతో రూట్ మార్చి..భాస్కర్ ను ఓకే చేశాడట. మరి చూడాలి ఈ సినిమా చై కెరీర్ కు ఎలా ప్లస్ అవుతుందో..?

Share post:

Latest