‘ ఆచార్య‌ ‘ పై మంచు ఫ్యాన్స్ రివేంజ్ మామూలుగా లేదుగా…!

రెండు నెల‌ల క్రింద‌ట మోహ‌న్‌బాబు స‌న్ ఆఫ్ ఇండియా సినిమా రిలీజ్ అయిన‌ప్పుడు ఆ సినిమాను సోష‌ల్ మీడియాలో అంద‌రూ ఓ ఆటాడుకున్నారు. టాలీవుడ్‌లో సీనియ‌ర్ న‌టుడు, పైగా 500 కు పైగా సినిమాల్లో న‌టించాడు. ఎన్నో సినిమాలు తీసిన నిర్మాత‌… పైగా న‌ల‌భై ఏళ్ల అనుభ‌వం. అలాంటి న‌టుడు చేసిన సినిమా రిలీజ్ అయితే మెజార్టీ థియేట‌ర్లు రిలీజ్ రోజు ఫ‌స్ట్ షోకే ఎత్తేశారు.

అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే చాలా థియేటర్లలో ముందు రోజు వరకు ఒక్క టికెట్ కూడా అమ్ముడ‌వ్వ‌లేదు. పైగా కొన్ని థియేట‌ర్ల‌లో ఒక‌టి, రెండు టిక్కెట్లు అమ్ముడు అయితే ఆ థియేట‌ర్ వాళ్లు బాబు నీ ఒక్క‌డి కోసం షో వేయ‌లేదు.. అని రివ‌ర్స్‌లో డ‌బ్బులు ఇచ్చి మ‌రీ వెన‌క్కు పంప‌డంపై విప‌రీత‌మైన ట్రోలింగ్ న‌డిచింది.

అయితే ఈ ట్రోలింగ్‌లో మెగా ఫ్యాన్స్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని మంచు కౌంపౌండ్ కాస్త అల‌క‌బూనింది. ఇందుకు మా ఎన్నిక‌లే ఈ రెండు కుటుంబాల మ‌ధ్య గొడ‌వ‌కు కార‌ణ‌మ‌య్యాయి. అయితే ఇప్పుడు చిరు – రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన ఆచార్య సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా ప్లాప్ అవ్వ‌డంతో పాటు చాలా చోట్ల మెట్రో న‌గ‌రాల్లోనూ క‌నీస అడ్వాన్స్ బుకింగ్‌ల‌కు కూడా నోచుకోవ‌డం లేదు.

దీంతో ఇప్పుడు మంచు అభిమానులు ఖాళీగా ఉన్న బుకింగ్స్ స్క్రీన్ షాట్లు తీసి మ‌రీ ఆచార్య‌పై ట్రోలింగ్ చేస్తున్నారు. వీరికి ఇత‌ర మెగా యాంటీ ఫ్యాన్స్ కూడా తోడ‌వుతున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో ఇప్పుడు మంచు ఫ్యాన్స్ రివేంజ్‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. ఆచార్యకు బాక్సాఫీస్ దగ్గర మరీ ఇంత దారుణ ప‌రిస్థితి ఉంటుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌నే లేదు.

Share post:

Latest