మహేశ్ అంటే అంత అలుసా..అభిమానులకు కోపం తెప్పించిన రాజమౌళి..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో గా నటించిన రీసెంట్ చిత్రం “సర్కారు వారి పాట”. పరశూరామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మే 12న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కొందరు సినిమా స్టోరీని తప్పుపడుతూ..నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నా .. కలెక్షన్స్ పరంగా దుమ్ము దులిపేస్తుంది. మరో వైపు మహేశ్ అభిమానులు కూడా సినిమా విజయాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమాకి కీర్తి సురేష్ , మహేశ్ లవ్ ట్రాక్ హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా తమన్ మ్యూజిక్ సినిమా ని మరో మెట్టు ఎక్కించింది.

అభిమానులు అయితే సర్కారు వారిపాట హ్యాష్ ట్యాగ్స్ తో మహేశ్ బాబు నెం 1 హీరో అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే, ఈ క్రమంలోనే మహేశ్ అభిమానులను హర్ట్ చేసింది ఓ ట్వీట్. దీంతో మహేశ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే..రాజమౌళి RRR సినిమా కోసం ఎంత కష్టపడ్డారో తెలిసిందే. క్రింద మీద పడి తెరకెక్కించి ..ఎట్టకేలకు సక్సెస్ కొట్టారు. ఓకే బాగానే ఉంది.

అయితే, రీసెంట్ గా తమిళ హీరో శివ కార్తికేయన్ హీరో గా నటించిన డాన్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో సినిమా ని పొగుడుతూ శుభాకాంక్షలు తెలియజేసింది RRR టీం. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల సమయంలో శివ కార్తికేయన్ చేసిన సాయం మరువలేనిది. ఆర్ఆర్ఆర్ కోసం ఏకంగా తన సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసుకవడం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే RRR టీ ట్వీట్ చేసిన్నత్లుంది. ఇక ఇదే విషయమై మహేశ్ అభిమానులు రాజమౌళిని నిలదీస్తున్నారు. పక్క భాష ఇండస్ట్రీ హీరో ని పొగడడానికి మీకు టైం ఉంది కానీ, మన తెలుగు హీరో సినిమా హిట్ అయితే ఓ ట్వీట్ కూదా చేయరా..ఇదేం పైశాచిక ఆనందం అంటూ తిట్టిపోస్తున్నారు. మీరు అయిన చెప్పాలి కదా జక్కన్న.. మహేశ్ తో మీరు నెక్స్ట్ సినిమా చేస్తున్నారుగా..ఆ మాత్రం బాధ్యత నీకు లేదా..అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. దీంతో మ్యాటర్ హీట్ పెరిగిపోయింది.

Share post:

Popular