బెట్టు చేస్తున్న జాన్వీ..అమ్మడికి అంత సీన్ ఉందా..?

గత కొన్ని సంవత్సరాల నుండి అటు బాలీవూడ్ లోను ఇటు టాలీవుడ్ లోను ఓ వార్త డప్పు కొడుతూనే ఉంది. అదే స్టార్ డాటర్ శ్రీదేవి కూతురు..జాన్వీ కపూర్ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని. అదిగో వచ్చేస్తుంది..ఇదిగో వచ్చేస్తుంది..ఆ స్టార్ హీరో తో కన్ఫామ్ అయ్యింది..అంటూ జాన్వీ డెబ్యూ పై ఇప్పటికే బోలెడు వార్తలు వైరల్ అవుతున్నాయి కానీ,..వాటిలో ఏ ఒక్కటి వర్క్ అవుట్ అవ్వలేదు.


అప్పుడెప్పుడో జాన్వీ ఓ ఇంటర్వ్యుల్లో “అమ్మ లాగ తెలుగు సినిమాలో కూడా నటించాలని ఉంది ..ఖచ్చితంగా నటిస్తా” అంటూ చెప్పుకొచ్చింది. అంతే, అప్పటి నుండి జాన్వీ తెలుగు లో సినిమాకి కమిట్ అయ్యిందని వార్తలు గుప్పుమంటున్నాయి. కొందరమో తారక్ సరసన నటించేందుకు సిద్ధమైందని..మరికొందరు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ సినిమాలో నటిస్తుందని..ఇక ఇప్పుడు ఏమో విజయ్ దేవరకోండ తో సినిమా ఫిక్స్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నా ..అవన్ని ఫేక్ అని అర్ధమైపోతున్నాయి.

ఇక్కడ అర్ధం కానీ విషయం ఏమిటంటే..నిజంగా జాన్వీ కి అంత సీన్ ఉందా..?..ఇన్ని సంవత్సరాల నుండి ఆమ్మడు పై ఇన్ని వార్తలు వస్తున్నా..స్వయాన బోనీ కపూర్ కూడా జాన్వీ తెలుగులో సినిమా చేస్తుంది అని చెప్పినా..ఇప్పటి వరకు అమ్మడు ఏ సినిమాకి కూడా సైన్ చేయలేదు..పోనీ, బాలీవుడ్ లో అమ్మడు చించేసే హీరోయిన్ నా అంటే అది కాదు. శ్రీదేవి డాటర్ గా నెట్టుకొస్తుందే కానీ, అక్కడ మ్యాటర్ లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. జాన్వీ సోషల్ మీడియాలో ఎక్స్ పోజింగ్ తప్పిస్తే..చెప్పుకొతగ్గ పాయింట్స్ ఏం లేవు. మరి ఎందుకు జాన్వీ తెలుగు సినిమాల్లో ఆఫర్ వస్తున్నా ..సైలెంట్ గా ఉంది. తెలుగు సినిమాలో చేస్తా అంటూనే..ఆఫర్లను రిజెక్ట్ చేస్తుంది. పోనీ, తెలుగు నుండి చిన్న ఆఫర్లు అందుతున్నాయా అంటే అది లేదు..తారక్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిన పాప ఇంట్రెస్ట్ చూయించట్లేదట. మరి జాన్వీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అర్ధంకావడంలేదు. కొందరైతే పాపకి అంత సీన్ లేదు అంటు కామెంట్స్ చేస్తున్నారు. మరి జాన్వీ ఎంట్రీ ఎప్పుడో..ఎవ్వరితోనో..?

Share post:

Popular