అశోక‌వ‌నంలో అర్జున‌క‌ళ్యాణం హీరోయిన్ రుతిక నాయ‌క్ ఏజ్‌పై షాకింగ్ న్యూస్‌..!

విష్వక్ సేన్ అశోకవనంలో అర్ఙున కళ్యాణం సినిమా హీరోయిన్ ఎవ‌రు అంటే నిన్న‌టి వ‌ర‌కు రుష్క‌ర్ థిల్లాన్ అంటారు. జ‌నాలు కూడా అలాగే అనుకున్నారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో కూడా మ‌రో హీరోయిన్ ఉంద‌న్న విష‌యం ఎవ్వ‌రికి తెలియ‌దు. అంద‌రూ కూడా రుష్క‌ర్ గురించే మాట్లాడుకున్నారు. ప్ర‌మోష‌న్ల‌లో విశ్వ‌క్‌తో పాటు ఆమె గురించే చ‌ర్చ జ‌రిగింది. అయితే సినిమా రిలీజ్ రోజు చూస్తే అస‌లు రుష్క‌ర్ హీరోయిన్ కాదా ? అన్నంత‌గా ఉంది.

సినిమాకు సెంట‌ర్ ఆఫ్ ద ఎట్రాక్ష‌న్ అయిన రుష్క‌ర్ క్రెడిట్ అంతా మ‌రో అమ్మాయి కొట్టుకుపోయింది. సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఉంది.. అస‌లు ఈ విష‌యం పెద్ద‌గా జ‌నాల‌కు కూడా తెలియ‌పోయినా రిలీజ్ రోజు ఆ హీరోయిన్ హైలెట్ అయిపోయింది. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు అచ్చ తెలుగు అమ్మాయిలా క‌నిపించిన రుతిక నాయ‌క్‌. ఇప్పుడు ఈ అమ్మాయినే ఇప్పుడు సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది.

రుతిక నాయ‌క్‌ను సినిమాలో చూసిన వారంతా ఆమె వ‌య‌స్సు 25 ఏళ్లు అంటే ఎవ్వ‌రూ న‌మ్మ‌రు. అస‌లు ఆమె వ‌య‌స్సు ఏ 16 లేదా 18 అని మాత్ర‌మే అనుకుంటారు. అంత థిన్ ప‌ర్స‌నాలిటీతో పాటు ఆక‌ట్టుకునే న‌ట‌న‌తో ఆమె ఉంది. ఇప్పుడు ఆమె న‌ట‌న , అందం చూసిన వారంతా టాలీవుడ్ మిడ్ రేంజ్ సినిమాల‌కు మాంచి హీరోయిన్ దొరికింద‌నే అంటున్నారు.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా యూనిట్ రుతిక‌ను ఎందుకు మీడియా ముందుకు తీసుకు రాలేదో ? తెలియ‌డం లేదు. అస‌లు ఈ సినిమాలో రుతిక అనే హీరోయిన్ ఉంద‌న్న ప్ర‌చార‌మే ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు. మ‌రి ఈ సినిమా రుతిక‌కు పాజిటివ్ అవ్వ‌డంతో ఆమెను ముందు పెట్టి ప‌బ్లిసిటీ చేసుకుంటే సినిమాకు మ‌రింత ప్ల‌స్ అవుతుంది.