ఆచార్యలో ఈ మార్పులు చేసుంటే బ్లాక్ బస్టర్ పక్కా ?

ఒక సామెత అందరూ వినే ఉంటారు…” దొంగలు పడిన ఆరు నెలలకు… కుక్కలు మొరిగాయట” ఆ విధంగా ఉంది ఇప్పుడు ఆచార్య సినిమా పరిస్థితి. ఒక సినిమా హిట్ లేదా ప్లాప్ అన్న విషయం పూర్తిగా దర్శకుడు ఎంచుకున్న కథ, తెరకెక్కించే విధానం, ఎంచుకునే స్క్రీన్ ప్లే, నటీనటుల నుండి రాబట్టుకునే నటన ఇలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ విషయాలను అన్నీ కూడా సినిమా షూటింగ్ సమయంలో కరెక్ట్ చేసుకోవాలి. లేదా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో సరిచూసుకోవాలి. ఇక అవన్నీ వదిలేసి సినిమా రిలీజ్ అయ్యాక ఇందులో ఇది తక్కువయిందని, కథ ఇలా మార్చి ఉంటే బాగుండు అని కథలు చెబితే ఎలా… ఇప్పుడు తాజా విడుదలైన మెగా మూవీ ఆచార్య విషయంలో కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి.

కరోనా సమయంలోనే షూటింగ్ పూర్తి చేసుకుని ఎన్నో సార్లు విడుదలను వాయిదా వేసుకుని చివరికి గత వారం వరల్డ్ వైడ్ గా 2000 థియేటర్ లలో విడుదల అయింది. కానీ ఎవరి దురదృష్టమో తెలియదు కానీ, షాకింగ్ గా మొదటి షో నుండే సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ కారణంగా సినిమా కలెక్షన్ లు కూడా దారుణంగా ఉన్నాయి. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత దారుణమైన వీకెండ్ కలెక్షన్ లను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కొరటాల శివ తెరేక్కించిన సన్నివేశాలు బాగా రాలేదు. ఏ ఒక్క సీన్ లోనూ మెగాస్టార్ అభిమానులు సంతోషంగా లేరు.. అంటే మిగిలిన ప్రేక్షకుల పరిస్థితి ఏమిటో మీరే ఆలోచించండి. అసలు పొరపాటు ఎక్కడ జరిగింది అనేది వారికే తెలియాలి. అయితే ఇపుడు అభిమానులు ఈ సినిమా గురించి కొన్ని విషయములు సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నాయి. ఈ సినిమాలో కొన్ని మార్పులు చేసి ఉంటే… ఈ సినిమా ఫలితం ఇలా ఉండేది కాదంటూ అంటున్నారు. మరి అవి ఏ మార్పులు అనేది ఇప్పుడు చూద్దాం.

అందులో ప్రధానంగా ఈ సినిమా క్లైమాక్స్ బాగా సాగదీశారు అని విమర్శలు వస్తున్నాయి. క్లైమాక్స్ లో నిడివిని ఇంకా తగ్గించి ఉంటే బాగుండేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే ఈ సినిమాకు ప్రతికూలంగా మారిందని టాక్ ఉంది. ఇక ఈ సినిమాలో ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్న నక్సలైట్ బ్యాక్ డ్రాప్ పై అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. అసలు ఈ కాన్సెప్ట్ అనేది మన ప్రేక్షకులకు అస్సలు నచ్చదట. ఇంతకు ముందు చాలా సినిమాలో నక్సలిజం గురించి ఉంది. కానీ ఆ సినిమాలు ఏవీ ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి. అంతెందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్ బస్టర్ మూవీ జల్సా లోనూ క్లైమాక్స్ లో నక్సలిజం గురించి కొంత ఉంది. కానీ ఆ సినిమాలో కేవలం కొంత సమయం మాత్రమే డైరెక్టర్ పెట్టాడు. దానితో అదేమీ ప్రేక్షకులకు ఇబ్బంది అనిపించలేదు. లేకపోతే జల్సా ఫలితం కూడా తారుమారు అయ్యేది.

ఇక ఆచార్యలో చాలా సేపు ఈ నక్సలిజం ను కొనసాగించడంతో ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఇక మొదటి నుండి అనుకున్నట్లుగానే రామ్ చరణ్ సీన్స్ కొంత సమయం మాత్రమే డైరెక్టర్ ప్లాన్ చేశాడు. అయితే మధ్యలో ఏమి జరిగిందో తెలియదు కానీ రామ్ చరణ్ పాత్రను పెంచుకుంటూ పోయాడు. ఇది కూడా సినిమా ఫలితం ఇలా రావడానికి కారణం అయింది. ఇలా పైన మనము చెప్పుకున్న విషయాలలో జాగ్రత్తకు తీసుకుని ఉంటే సినిమా హిట్ అయ్యేదని మెగా అభిమానులు అనుకుంటున్నారు.