ప్రభాస్ అంత స్పాయిల్ చేస్తున్నాడు..లోఫర్ బ్యూటీ సంచలన పోస్ట్..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్.. ఆరు అడుగుల అందగాడు… చూడటానికి కటౌట్ సూపర్ గా ఉంటుంది. మనిషి ఎంత బాగుంటాడో..అంతకు మించిన మంచి గుణం..మంచి మనిషి. ఈ మాట ఆయన తో నటించిన అందరు నటులు చెప్పుతుంటారు. ఆయన తో సినిమా లో నటిస్తే చాలా నేర్చుకోవచ్చు..అని కొందరు, స్టార్ హీరో అనే గర్వమే ఉండదు అని మరికొందరు..చాలా కూల్ మనిషి అని ఇంకొందరు అంటుంటారు. కానీ, అందరు కామన్ గా చెప్పేది..ఆయన మర్యాదలను మనం భరించలేం అంటుంటారు.

ప్రభాస్ కి ఫస్ట్ నుండి ఓ అలవాటు ఉందట. తనతో సినిమా లో నటించే హీరోయిన్స్ కి, కొ స్టాఫ్ కి స్పెషల్ గా ఫుడ్ పంపిస్తుంటారట. స్వయంగా ఇంటి నుండి భోజనం తెప్పించి వారికీ కడుపు నిండా భోజనం పెట్టి వామ్మో మీము ఇక తినలేం..అనే విధంగా చేస్తుంటాడు. ఇప్పటికే ఆయన చాలా మంది స్టార్ హీరోలకి, హీరోయిన్లకి ఇలా తన ఇంటి నుండి ఫుడ్ బాక్సేస్ వెళ్లిన సంధర్భాలు చాలానే ఉన్నాయి. రాధే శ్యామ్ సినిమా టైం లో పూజా హెగ్డే కి, భాగ్య రేఖకి, ఆది పురుష్ షూటింగ్ టైంలో సైఫ్ అలీ ఖాన్ కి, సలార్ షూటింగ్ టైం లో శృతి హాసన్ కి, ఇక ప్రాజెక్ట్ K షూటింగ్ టైంలో దీపిక పదుకునేకి ..అన్ని రకలా ఐటెంస్ ని తన కుక్స్ తో చేసి పంపిచారు.

ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లోకి చేరిపోయింది..బాలీవుడ్ హాట్ బాంబ్ దిశా పటానీ. మనకు తెలిసిందే ఆమె ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ K సినిమాలో ఆమె ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాని రెండు రోజుల క్రితమే ఆమె అధికారికంగా పోస్ట్ చేసింది. ఇక ఇంతలోనే ప్రభాస్ ఆమెకు రెబల్ ఇంటి ఫుడ్ తినిపించేశాడు. రీసెంట్ గా జరిగిన షూటింగ్ షెడ్యూల్ లో అన్ని రకాల ఐటెంస్ స్పెషల్ గా చేయించి పంపించారట. ఇదే విషయాని ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ..” మమ్మల్ని స్పాయిల్ చేస్తున్నందుకు ధ్యాంక్యూ ప్రభాస్” అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ విషయం ట్రెండింగ్ గా మారింది.

Share post:

Popular