సౌందర్య ఆస్తి కోసం కుటుంబంలో ఇన్ని గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ అందాల నటి సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె అప్పట్లో గ్లామర్ తో మంచి మాటలతో.. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ ఉండేది సౌందర్య. సౌందర్య మరణం గురించి మనందరికీ తెలిసిన విషయమే.. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. ఇక ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్న సౌందర్య మరణం తెలుగు ఇండస్ట్రీకి ఒక తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు.

సౌందర్య బతికి ఉంటే ఎన్నో మంచి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మరింతగా మెప్పించేది. సినిమాలలో సక్సెస్ అయిన సౌందర్య రాజకీయాల్లో అడుగు పెట్టడం జరిగింది. బిజెపి పార్టీ తరఫున రాజకీయాల లోకి దూసుకు వెళ్తున్న సమయంలో ఈమె హెలికాప్టర్లో బయలుదేరగా ప్రమాదం చోటు చేసుకుంది. సౌందర్య సోదరుడు అమర్ నాథ్ కూడా మరణించాడు. అయితే ఆమె బంధువులు మాత్రం ఆమె ఆస్తుల కోసం పోరాడుతున్నట్లు గా సమాచారం తెలుస్తోంది.

సౌందర్య తల్లి మంజుల, సౌందర్య భర్త రఘు ఒక వైపు ఉండగా మరొక వైపు సౌందర్య మరదలు అమర్ నాథ్ భార్య నిర్మల ఆస్తుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నది. సౌందర్య కి 6 కాస్ట్లీ ప్రాపర్టీస్ తో పాటుగా.. భారీగా బంగారం ఉన్నట్లుగా తెలుస్తోంది. వారి కుటుంబానికి రెండు ఇల్లు ఉండగా అందులో ఒకటి అమర్నాథ్ కుమారుడు పేరు పైన ఉందట. మరొక ఇల్లు సౌందర్య మరియు ఆమె సోదరుడి పైన రాసి ఉన్నట్లు సమాచారం.

ఇకపోతే హైదరాబాదులో ఉన్న ప్రాపర్టీ డబ్బులు ఆమె తల్లి , సౌందర్య భర్త పిల్లలకు అందేవి కానీ సౌందర్య మేనల్లుడు తల్లి అందకుండా కోర్టులో కేసు వేశారు. తన నానమ్మ ప్రాపర్టీని తన పేరున రాయాలని కేసు వేశారు. ఈ కేసులో సాత్విక్ కి న్యాయం జరిగిందని తెలుస్తోంది. కోర్టులో సౌందర్య తల్లి మంజుల, సౌందర్య భర్త రఘు లకు వేసిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆస్తి మొత్తం సాత్విక్ కి అప్పగించినట్లు తెలుస్తోంది.

Share post:

Popular