ఒక్కరోజు కాల్షీట్ కోసం అనసూయ పారితోషకం అన్ని లక్షలా..?

అనసూయ మొదటగా నాగ సినిమాలో లాయర్ స్టూడెంట్ గా సునీల్ పక్కన మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సాక్షి ఆఫీస్ లో న్యూస్ రీడర్ గా పని చేసింది. కానీ అప్పటి వరకు ఈమె గురించి పెద్దగా ఎవరికీ తెలియదు అని చెప్పాలి. కానీ ఎప్పుడైతే ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా తన కెరీర్ ని మొదలు పెట్టిందో.. అప్పటి నుంచి ఆమె దశ తిరిగింది అని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ యాంకర్లుగా కొనసాగుతున్న వారిలో అనసూయ కూడా ఒకరు. అనసూయకు ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈమె బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తూ.. మరొకవైపు సినిమాలలో నటిగా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.

ఇక అనసూయ వరుస సినిమాలతో నటిస్తూ ఎంతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే వరుస సినిమాలలో నటిస్తున్న ఈమె ఒక్క సినిమాకు ఎంత పారితోషకం తీసుకుంటారు అనే విషయం తెలిస్తే మాత్రం తప్పకుండా ఆశ్చర్యపోవాల్సిందే. జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత వెండితెర ప్రవేశం చేసింది. నిజానికి ఈమెకు హీరోయిన్ రేంజ్ పాపులారిటీ ఉన్నప్పటికీ కారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే స్థిరపడిపోయింది. కానీ పారితోషికం విషయంలో అనసూయ రేంజ్ మాత్రం హీరోయిన్ రేంజ్ అని చెప్పవచ్చు.

ఎందుకంటే ఒక్క రోజు షూటింగ్ లో పాల్గొంటే ఈమె ఏకంగా రూ.5 లక్షల నుండి రూ.6.5 లక్షల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అదే పది రోజులపాటు షూటింగ్ లో పాల్గొంటే సుమారుగా రూ.50 లక్షలు అలాగే 20 రోజులపాటు షూటింగ్ లో పాల్గొంటే ఏకంగా కోటి రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక తాజాగా ఈమె నటించిన పుష్ప సినిమా కోసం అనసూయ పెద్దగా కాల్షీట్లు ఇవ్వకపోయినా పుష్ప సినిమా నుంచి ఈమె ఏకంగా 40 లక్షల రూపాయల పారితోషికం అందుకున్నట్లు సమాచారం.

Share post:

Popular