కాజల్ పద్ధతి బాగోలేదబ్బా..అభిమానులు హర్ట్..!

టాలీవుడ్ ని తన అంద చందాలతో ఏలేసిన చందమామ కాజల్ అగర్వాల్. అందానికి అందం నటనకి నటన తెలివితేటలు ఎక్కువే.. దీంతో ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోల సరసన ఛాన్సులు అందుకుని..ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. తెలుగు, తమిళ,హీంది భాషల్లో సినిమా చేస్తూ ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయిన కాజల్..తన చిన్న నాటి ఫ్రెండ్ గౌతమ్ కిచ్చులు ని పెళ్లి చేసుకుని.. హ్యాపీ గా మ్యారిడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. జనరల్ గా హీరోయిన్స్ పెళ్లి లేట్ గా చేసుకుంటారు. బిడ్డలని లేట్ గా కంటారు.

బిడ్డ పుట్టిన తరువాత తమ అందం పాడైపోతుందని..బాడీలో వచ్చే మార్పులను కంట్రోల్ చేయడం చాలా కష్టమని కొందరి భావన. కానీ, కాజల్ పెళ్ళి ఆలస్యంగా చేసుకున్నా..బిడ్డను మాత్రం త్వరగానే కన్నేసింది. కడుపుతో ఉన్న టైంలో తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ గర్భవతి గా ఉన్న టైంలో తాను పొందిన ప్రతి ఫీలింగ్ ను..అభిమానులతో పంచుకుంటూ ప్రెగ్నెంట్ లేడీస్ కి కొన్ని టిప్స్ ఇచ్చింది. ఇక ఈ మధ్యనే ఏప్రిల్ 19న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది కాజల్..అబ్బాయి కి నీల్ అంటూ కూడా పేరు పెట్టేశారు కాజల్ దంపతులు.

అయితే, బిడ్డ పుట్టాక టోటల్ కాన్సెన్ట్రేషన్ బేబీ పై ఉంచుతుందని..ఇక కాజల్ సినిమాలు చేయదని.. సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసిందని గత వారం రోజులు గా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కాజల్..ఆ వార్తలను తిప్పికొడుతూ..ఓ హాట్ పిక్..అది కూడా డెలివరీ అయ్యాక దిగ్గిన ఫోటో ని ఇన్స్టా లో పోస్ట్ చేసింది. గ్రీన్‌ కలర్‌, ఎల్లో మేళవింపులో ఉన్న డ్రెస్‌లో వయ్యారాలు పోయింది కాజల్‌. కాస్త థై షోతో హాట్‌ పోజులిచ్చింది. చూడబోతే తగ్గేదెలే అని సిగ్నల్‌ ఇస్తున్నట్టుగా ఉందంటున్నారు నెటిజన్లు. అయితే, కొందరు నెటిజన్లు తిట్టిపోస్తున్నారు..బిడ్డ పుట్టి నెల రోజులు కూడా అవ్వలేదు..అప్పుడే నీకు అంత తొందరా..ఏంటీ ఈ ఫోటోలు కాజల్..నీ దగ్గర నుండి ఇది ఎక్స్ పెక్ట్ చేయలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైన కాజల్ చేసింది తప్పే అంటున్నారు కొందరు సినీ స్టార్స్. మరి చూడాలి కాజల్ ఎలా రీఎంట్రీ ఇస్తుందో..