ఏపీలో పేద‌రికం త‌గ్గిస్తోన్న జ‌గ‌న్‌…ఇదిగో ఇలా !

రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు… సంక్షేమం విష‌యంలో కొన్ని మీడియా హౌస్‌లు వ్య‌తిరేక క‌థ‌నాల‌ను ప్ర‌చురిస్తున్నాయి. మంచిదే.. మీడియాది కూడా.. ప్ర‌తిప‌క్ష పాత్రే కాబ‌ట్టి.. ఇబ్బంది లేదు. అయితే.. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను కార్న‌ర్ చేస్తూ.. చేస్తున్న విమ‌ర్శ‌ల‌కే మేధావులు స్పందిస్తున్నారు. జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల్లో అమ్మ ఒడి, రైతు నేస్తం, భ‌రోసా, చేయూత‌, ఇలా.. అనేక ప‌థ‌కాలు ఉన్నాయి. వీటి ద్వారా.. జ‌గ‌న్‌.. ల‌బ్ధిదారులైన ప్ర‌జ‌ల‌కు వేల కోట్ల రూపాయ‌ల‌ను అందిస్తున్నారు.

అయితే.. ఈ ప‌థ‌కాల‌తో రాష్ట్రంలోని పేద‌ల‌ను జ‌గ‌న్ పెంచి పోషిస్తున్నార‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌. దీనిపైనే మేధావులు.. మాట్లాడుతున్నారు. “ఆర్థిక మార్పులు రావాల్సిందే. క‌రోనా ఎఫెక్ట్‌తో ప్ర‌జ‌లు ఇబ్బంద‌ది ప‌డు తున్నారు. ఈ నేప‌థ్యంలో వారి చేతిలో కొంత డ‌బ్బు ఉండ‌డం ద్వారా మార్కెట్ లో కొనుగోలు వినిమ‌య శ‌క్తుల మ‌ధ్య సారూప్య‌త అలానే కొన‌సాగుతుంద‌ని.. అంటున్నారు. దీనివ‌ల్ల రాష్ట్రంలో ఆర్థిక స‌మ‌తుల్య‌త కొన‌సాగి.. ప్ర‌జలు రోడ్డున ప‌డ‌కుండా ఉంటారని కూడా విశ్లేషిస్తున్నారు.

అస‌లు.. ప్ర‌భుత్వాలు ప్ర‌వేశ పెట్టే.. ప‌థ‌కాల వెనుక కూడా అంత‌రార్థం ఇదేన‌ని చెబుతున్నారు. అయితే.. దీనివ‌ల్ల పేద‌రికం పెరుగుతుంద‌ని.. పేద‌లు పేదులుగానే ఉండిపోతార‌ని.. చేస్తున్న విశ్లేష‌ణ‌ల్లో వాస్త‌వా లు లేవ‌ని.. ఊక దంపుడు రాత‌లు త‌ప్ప‌.. ప్ర‌యోజనం ఏంట‌ని అంటున్నారు. అంతేకాదు.. చేతిలో డ‌బ్బులు లేన‌ప్పుడే.. పేద‌లుగా ఉంటార‌ని.. అవి ఉంటే.. ఎంత క‌టిక పేద‌రికంలో ఉన్న వారైనా.. మంచిగా జీవించాల‌నే కోరుకుంటార‌ని.. చెబుతున్నారు.

వాస్త‌వానికి రాష్ట్ర ప్ర‌భుత్వం పెడుతున్న ప‌థ‌కాల‌ను గ‌మ‌నిస్తే.. భ‌రోసా, చేయూత‌, వాహ‌న‌మిత్ర‌.. వంటి ప‌థ‌కాల పేరుల్లోనే స‌ర్కారు ల‌క్ష్యాలు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు. అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు పేద‌లుగా ఉన్న‌వారు.. ఇక‌, ఎప్ప‌టికీ అలా ఉండాల్సిన అవ‌స‌రం లేద‌నే విధంగా.. జ‌గ‌న్ అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌తో పేద‌ల త‌ల‌రాత‌లు మారుతున్నాయ‌ని.. వివ‌రిస్తున్నారు. భ‌రోసా, చేదోడు, నేత‌న్న నేస్తం ఫథ‌కాల ల‌క్ష్యం బాగున్న‌ప్పుడు.. మ‌ళ్లీ మ‌ళ్లీ జ‌గ‌న్‌దే విజ‌య‌మ‌ని నొక్కొ చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

Share post:

Popular