వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు.. ఆ డబ్బు ఏం చేస్తారో తెలుసా?

ఒకసారి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చిన తర్వాత హీరోగా క్లిక్ అయ్యారు అంటే చాలు ఇక 100ల కోట్లు సంపాదించే అవకాశం ఉంటుంది. ఒక వైపు సినిమాల ద్వారా మరో వైపు వాణిజ్య ప్రకటనల ద్వారా ఓవైపు సోషల్ మీడియా ద్వారా ఇలా అన్ని విధాలుగా సంపాదిస్తూనే ఉంటారు సినిమా హీరోలు ఇటీవల కాలంలో అయితే ఒక్క సినిమా కోసం వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. వాణిజ్య ప్రకటనల్లో కూడా కోట్లకి కోట్లు తీసుకుంటున్నారు. అయితే ఇలా వందల కోట్లు సంపాదిస్తున్న మన స్టార్లు ఇంతకీ ఈ కోట్ల రూపాయలను ఏం చేస్తారు అసలు ఎక్కడ ఖర్చు పెడతారు అనేది మాత్రం చాలామందికి ఒక డౌటు ఉంటుంది.

అయితే ఇలా సినిమాల్లో సంపాదించిన వందల కోట్ల రూపాయలతో కొన్ని బిజినెస్ లలో పెట్టుబడులు పెడుతూ వుంటారు చాలామంది. అయితే ఒకప్పుడైతే స్టూడియోలు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్కి తగ్గట్టు గానే రకరకాల సెక్టార్ లలో ఇన్వెస్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఒక్కో సినిమాకి 100 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకునే ప్రభాస్.. ఒకేచోట కాకుండా డిఫరెంట్ వ్యాపారాలలో
పెట్టుబడిగా పెడుతున్నాడట ప్రస్తుతం ఒక్కో సినిమాకి 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే పవర్స్టార్ పవన్కళ్యాణ్ సంపాదన మాత్రం ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం లేదట. తనకు ఉన్న జనసేన పార్టీ ని మెయింటైన్ చేయడానికి ఇక రెమ్యూనరేషన్ మొత్తం ఖర్చు చేస్తున్నారట పవన్ కళ్యాణ్.

టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు ఒక్క సినిమాకి 80 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు. మహేష్ బాబు సంపాదన మొత్తం భార్య నమ్రత ఎంతో తెలివిగా పెట్టుబడులు పెడుతూ ఉంటుందట. రియల్ ఎస్టేట్, క్లాత్ బ్రాండ్, టాప్ బ్రాండ్ యాడ్స్ తో సంపాదించే డబ్బును మేజర్ ప్రొడక్షన్ కి ఖర్చు పెడతారట. అంతేకాదు నమ్రత ఇక మహేష్ బాబు సంపదనే రియల్ ఎస్టేట్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తారట. ఇప్పటికే మహేష్ బాబుకు థియేటర్ బిజినెస్ లో కూడా ఉన్నాయి అని తెలిసిందే. ఇలా వందల కోట్లు సంపాదిస్తున్నా స్టార్లు సంపదను మరింత డబుల్ చేసేందుకు వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు..