ప్రభాస్ పెళ్లయ్యాకే నా పెళ్లి.. షాక్ ఇచ్చిన హీరోయిన్?

అతను ఒక పెద్ద హీరో.. ఒక సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్తో సినిమాలు తీస్తున్నాడు. అంతే కాదు వందల కోట్ల పారితోషికాన్ని కూడా అందుకుంటున్నాడు. ఇండస్ట్రీలో మిగతా హీరోలకు అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక వరుసగా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కానీ అటు అభిమానుల కోరిక మాత్రం తీర్చడం లేదు. వరుస సినిమాలతో అభిమానులను పలకరిస్తున్నాడు అంటున్నారు కదా ఇక అభిమానుల కోరిక ఇంకా ఏముంటుంది అని అనుకుంటున్నారు కదా.. సినిమాలు సరే నిజజీవితంలో తమ అభిమాన హీరో పెళ్లి అయితే చూడాలని అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇంతలా చెప్పానంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ హీరో ఎవరు అని.. ఇంకెవరు టాలీవుడ్ డార్లింగ్ భారతీయ చలన చిత్ర పరిశ్రమ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.

ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరయ్యా అంటే టక్కున చెప్పే పేరు ప్రభాస్. వయసు మీద పడి పోతుంది తప్ప ప్రభాస్ కు పెళ్లి పై ఆలోచన మాత్రం అసలు రావడం లేదు. రోజు రోజుకి ప్రభాస్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది తప్ప అభిమానుల కోరిక మాత్రం అస్సలు తీయడం లేదు. ఇక ప్రభాస్ పెళ్లి జరుగుతుంది అని ఇప్పటి వరకు ఎన్నో వార్తలు వచ్చాయి తప్ప అఫీషియల్ ప్రకటన కూడా రాలేదు. ఇలాంటి సమయంలో తాను ప్రభాస్ పెళ్లి చేసుకునే అంత వరకు పెళ్లి చేసుకోను అంటూ ఇటీవల ఒక హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ప్రభాస్ అంటే తనకు క్రష్ ఉందని ఇక అమితంగా అభిమానిస్తూ ఉంటాను అంటూ చెబుతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రీ రాపాక. ఒకవేళ కనుక అదృష్టం కలిసి వచ్చి తనకు ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం వస్తే వదులుకునే ప్రసక్తే లేదు అంటూ చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక బుల్లితెరపై ఎప్పుడైనా ప్రభాస్ సినిమా వచ్చింది అంటే చాలు అలా టీవీ చూస్తూ ఉండి పోతా అని చెప్పుకొచ్చింది.. ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్గా పనిచేసిన శ్రీ రాపాక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. తాను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని.. ప్రభాస్ పెళ్లి అయిన తర్వాతనే తాను పెళ్లి చేసుకుంటాను అంటూ చెబుతోంది..

Share post:

Latest