ఈ టైంలో ఏంటి ఇది డార్లింగ్..అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న ప్రభాస్ నిర్ణయం..?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవ్వరు అంటే అందరు టక్కున్న చెప్పే పేరు..ప్రభాస్. ఆరు అడుగుల అందగాడు..ఆ హైట్ కి తగ్గ వెయిట్.. అలాంటి కటౌట్ చూసి పడిపోని వాళ్లు ఉంటారా.. ఎవ్వరైన ప్రభాస్ ని చూసి పడిపోవాల్సిందే.. అలాంటి అందం ఆయన సొంతం. కానీ , ఈ మధ్య కొంచెం గ్లామర్ తగ్గిందంటున్నారు జనాలు..వయసు పెరిగేకొద్ది అందం తగ్గడ సహజం..బహుశా ప్రభాస్ కి కూడా అలానే అయ్యుండచ్చు..కానీ తెర పై మాత్రం ఆయన యాక్టింగ్ లో మార్పే లేదు.

ఆ డైలాగ్ టైమింగ్ ..రైమింగ్. ఆ ఎక్స్ ప్రేషన్స్..ప్రభాస్ స్మైల్ ..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పచ్చు రెబల్ స్టార్ గురించి. అయితే బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ప్రభాస్ కి దిష్టి తగ్గిలిన్నట్లుంది . అందుకే ఇన్నేళ్ళు అవుతున్న ఇప్పటి వరకు ఒక్క హిట్ అందుకోలేకపోతున్నాడు. బాహుబలి తరువాత వచ్చిన సాహో, నిన్న కాక మొన్న వచ్చిన రాధే శ్యామ్ రెండు బాక్స్ ఆఫిస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. అయిన కానీ ప్రభాస్ రేంజ్ మార్లేదు. ఆయన పై ఫ్యాన్స్ కి అభిమానం క్రేజ్ కూడా అంతే..!

ప్రభాస్ నటించిన రాధ్యే శ్యామ్ ఫ్లాప్ అయిన తరువాత ఆయన సినిమా ల పై సినిమా కధల పై ఎక్కువ కాన్ సెంట్రేషన్ చేయాలని..లేకపోతే ప్రభాస్ సినీ కెరీర్ కే దెబ్బ అని పలువురు ప్రముఖులు సజీషన్స్ ఇస్తున్నారు. కానీ, ప్రభాస్ ఎందుకో కానీ మళ్ళీ మళ్లీ అదే తప్పు చేస్తూ కెరీర్ ని రిస్క్ లో వేసుకుంటున్నారు. రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ మరో యంగ్ డైరెక్టర్ సినిమాకి సైన్ చేసిన్నట్లు తెలుస్తుంది. సాహో, రాధేశ్యామ్ ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత కూడా ప్రభాస్ ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ కు అవకాశం ఇవ్వాలనుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రభాస్ తన రేంజ్ కి తగ్గ డైరెక్టర్లతో పని చేస్తేనే బాగుంటుందని అభిమానులు కూడా చెప్పుకొస్తున్నారు. కానీ వాళ్ల మాటలు వినకుండా డార్లింగ్ ఎందుకు ఇలా యంగ్ డైరెక్టర్లకు కమిట్ అవుతున్నాడొ అర్ధం కావడం లేదు. ఏది ఏమైనా ప్రభాస్ ఇప్పుడున్న టైంకి ఒక్క హిట్ సినిమా కూడా పడకపోతే ..ఖచ్చితంగా తేడాలు వచ్చేస్తాయి..మరి ప్రభాస్ ఇష్టం అంతా..?

Share post:

Popular