కే జి ఎఫ్ చాప్టర్ 2.. మొదటి రివ్యూ వచ్చేసింది.. సినిమా దబిడి దిబిడేనట?

కే జి ఎఫ్.. చెప్పుకోవడానికి పేరు మూడు అక్షరాలు మాత్రమే. కానీ ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మొట్టమొదటిసారిగా కన్నడా ఇండస్ట్రీ నుంచి విడుదలై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమాగా కే జి ఎఫ్ నిలిచింది. ఇక కే జి ఎఫ్ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో ఇది తక్కువైంది అని చెప్పేందుకు కూడా ప్రేక్షకులకు నోరు రాలేదు అంటే సినిమా ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా సినిమాల్లో హీరోలు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటారు. కానీ కేజిఎఫ్ విషయంలో మాత్రం ప్రేక్షకుడే సినిమాల్లోకి ప్రవేశిస్తాడు. ఇక సినిమాలో హీరో యష్ పాత్రలో తనని తాను ఊహించుకుంటాడు ప్రేక్షకుడు..

కొన్ని సన్నివేశాలలో అయితే సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి రక్తం మరిగిపోతుంది. ఆ రేంజ్ లో ఈ సినిమా ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేసింది. ఇక బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఇదే సినిమాకు కొనసాగింపుగా కే జి ఎఫ్ చాప్టర్ 2 మరికొన్ని రోజుల్లో రాబోతుంది. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందు విడుదల కాబోతుంది. పాన్ ఇండియా సినిమా కాకపోయినప్పటికీ అంతకుమించి అనే రేంజ్ లో ఈ సినిమాపై అంచనాలున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

ఇండియన్ సినిమాలకు ముందే రివ్యూ ఇచ్చే యూ.ఎస్.సి సెన్సార్ బోర్డు సభ్యులు.. సిని అనలిస్టు ఉమైర్ సందు ఈ సినిమా కోసం రివ్యూ చాలా పెద్దగా రాసుకొచ్చాడు. కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా కన్నడ ఇండస్ట్రీకి కీర్తి కిరీటం లాంటిది.. సినిమాలో మొదటి నుంచి చివరి వరకు హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు సినిమా నిండా ఎన్నో పంచు డైలాగులు.. వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ఓ రేంజ్లో నిలబెట్టింది. ఇక సినిమాలో ఆద్యంతం ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చూపించడంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తన పనితనం చూపించాడు. నటీనటులందరూ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. మరో వరల్డ్ క్లాస్ మూవీ అంటూ ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేశాడు ఉమైర్ సంధు.

Share post:

Latest