సర్కారు వారి పాట సినిమాలో హైలైట్ సీన్ అదే..ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్..?

టాలీవుడ్ లో బడా బడా సినిమాలు ఒక్కోకటిగా రిలీజ్ అవుతూ ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. మొదట భీంలా నాయక్ పర్లేదు అనే టాక్ వినిపించినా..ఆ తరువాత వచ్చిన రాధ్యే శ్యామ్ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక ఆ తరువాత విడుదలైన RRR చిత్రం బాక్స్ ఆఫిస్ ను షేక్ చేస్తుంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే కని విని ఎరుగని కలెక్షన్ స్ ను సాధిస్తూ టాప్ నెం 1 స్దానాని సంపాదించుకుంది RRR.

ఇక ఇప్పుడు సీనీ లవర్స్ అందరి కళ్లు ఆచార్య, సర్కారు వారి పాట సినిమా పైనే ఉన్నాయి. నిజానికి రాజమౌళి తో నటించిన ఏ హీరో సినిమా అయినా తన పక్క సినిమా ఫ్లాప్ అవ్వడం ఓ నమ్మకంలా వస్తుంది ఇప్పటి వరకు మనం చూసిన్నట్లైతే అన్నీ..అలానే జరుగుతూ వచ్చాయి. ఒక్కవేళ అదే నిజమైతే బాక్స్ ఆఫిస్ వద్ద ఆచార్య బొల్తా కొట్టడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. దీంతో ఆచార్య సినిమా పై కొంచెం నెగిటివ్ ఫీలింగ్స్ కలుగుతున్నాయి జనాలకు.

ఇక మిగిలింది..సర్కారు వారి పాట . మహేష్ బాబు హీరో గా అందాల తార కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాని డైనమిక్ డైరెక్టర్ పరశూరాం ఓ ఢిఫరెంట్ కాన్ సెప్ట్ తో తెరకెక్కిస్తున్నాడు. దీనికి తోడు ధమన్ సంగీతం ఈ సినిమాకి మరింత ప్లస్ గా మారనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలు అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. కాగా, ఈ సినిమా నుండి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీకైంది. ఈ సినిమాలో మహేష్, కీర్తి సురేష్ మధ్య ఓ రొమాంటిక్ సీన్ వస్తుందని..ఆ టైంలో అభిమానులు పొట్ట చెక్కలయ్యే విధంగా నవ్వుతారని..ప్రజెంట్ అమ్మాయిలు మనసు ఎలా మారిపోతుందో చెప్పే విధంగా ఆ సీన్ ఉంటుందని..సినిమా బృందం నుండి ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ షాట్ చేసేటప్పుడు కీర్తి పడి పడి నవ్వేసిందట. దీంతో ఆ సీన్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ . సర్కారు వారి పాట సినిమాతో సూపర్ స్టార్ మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు అని తెలుస్తుంది.

Share post:

Popular