కొరటాల శివ సినిమాల్లో ఈ ఒక్క కామ‌న్ పాయింట్ చూశారా… అంద‌రు హీరోలు అలా చేయాల్సిందే…!

కొరటాల శివ పరిచయం అక్కర్లేదు. తీసిన సినిమాలన్నీ దాదాపు బాక్షాఫీస్ ని షేక్ చేసేవే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా రాబోతున్న విషయం తెలిసినదే. దాదాపు 4 సినిమాల వరుస హిట్స్ తరువాత కొరటాల ఈ సినిమా చేయబోతున్నందున ఈ సినిమాపైన పరిమితికి మించిన అంచనాలు నెలకొన్నాయి. ఓ వైపు మెగాస్టార్, మరో వైపు మెగా పవర్ స్టార్ ఇందులో సందడి చేయడం వలన కూడా ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది.

షూటింగ్ పూర్తయినా కూడా కరోనా కారణంగా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసినదే. ఇందులో చిరంజీవి పక్కన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత కాజల్ – చిరు కాంబినేషన్ లో రాబోతున్న 2వ సినిమా ఇది. కొరటాల శివ మిర్చి సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టిన సంగతి విదితమే. ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా హిట్స్ మీద హిట్స్ ఇచ్చాడు శివ. దాంతో ఆచార్య సినిమా మీద ప్రేక్షకులు అంచనాలు కొంచెం భారీగానే పెట్టుకున్నారు.

ఇకపోతే కొరటాల శివ సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. దాన్ని గమనించారో లేదో తెలియదు గాని ఇది నిజం. అవును.. కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమాల్లో దాదాపు అందరు హీరోలు ఒక బ్యాగ్ వేసుకొని కనిపిస్తారు. మిర్చిలో ప్రభాస్, శ్రీమంతుడులో మహేష్, జనతా గ్యారేజ్ లో జూనియర్ ఎన్టీఆర్, ఇపుడు ఆచార్యలో చిరంజీవి కూడా ఇలాగే బ్యాగ్ వేసుకొని మనకు కనిపిస్తున్నారు. ఇలా సినిమా మొత్తం కాకపోయినా ఏదో ఒక సందర్భంలో ఇలా బ్యాగ్ పట్టుకోవడం మనం గమనించవచ్చు.

ఇది కొరటాల శివ దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాల్లో మనం చూడవచ్చును. బహుశ, కొరటాలకు బ్యాగ్ అంటే ఇష్టం కాబోలు. అందుకే హీరో బ్యాగు పట్టుకున్న సన్నివేశాన్ని తన సినిమాలలో వుండేటట్టు చూసుకుంటారు అని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనితో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయం ఏమిటి?