కాజల్‌ కి కొరటాల కోటి రూపాయిలు..సంచలన మ్యాటర్ లీక్ ..?

మెగా అబిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన సినిమా..”ఆచార్య”. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేడు ధియేటర్స్ లోకి రిలీజ్ అయ్యి..డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఏదో ఊహించి సినిమాకి వెళ్లిన వాళ్లు బయటకు రాగానే ఇస్తున్న రివ్యూలు చూసి..మెగా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అయితే, ఈ సినిమా చూసిన బయటకు వచ్చిన జనాలు చాలా మంది హీరోయిన్ కాజల్ పేరు ని ప్రస్తావించడం గమనార్హం.

కొందరు అయితే, కాజల్ ని హీరోయిన్ గా పెట్టి ఉంటే ఖచ్చితంగా సినిమా రిజల్ట్ లో మార్పు ఉండేది అని అంటున్నారు. కాగా, ఈ టైంలో నే నెట్టింట ఓ షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. మనకు తెలిసిందే..కొరటాల శివ ఈ సినిమా లో ముందుగా హీరోయిన్ గా ఫిక్స్ చేసింది కాజల్ నే. ఆ తరువాత కధలో మార్పులు చేర్పులు చేసి.. టోటల్ డ్యామేజీ చేసేసి..కాజల్ ని సినిమా నుండి తప్పించేశాడు. ఈ విషయం గత వారం రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాజల్ ఫ్యాన్స్ కూడా కొరటాల పై ఫైర్ అయ్యారు.

ఆమె పాపులారిటీని వాడుకుని.. చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చావు ..ఆమె ఉసురు కూడా తగులుతుంది అన్న కామెంట్లు వినిపించాయి. ఇన్ని జరుగుతున్న కాజల్ దీని పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దానికి కారణం ఇదే అంటూ ఓ వార్త మీడియాలో వైరల్ గా మారింది. సినిమా కు కమిట్ అయిన్నప్పుడు కొరటాల అడ్వాన్స్ క్రింద కాజల్ కి కోటి రూపాయిలు ఇచ్చారట. సినిమా క్యాన్సిల్ అయ్యాక కాజల్ కోటీ ఇస్తుంటే ..నో..వద్దు నీకే అది..అంటూ ఆమెను కూల్ చేశాడట కొరటాల. అందుకే ఇంత జరుగుతున్న..ఫ్యాన్స్ మండిపడుతున్న కనీసం కాజల్ దీని పై ఓ చిన్న పొస్ట్ కూడా పెట్టలేదు అని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆచార్య ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాక ఈ వార్త వైరల్ అవ్వడం అందరికి షాకింగ్ గా అనిపిస్తుంది.

Share post:

Popular