ఆ ఇద్దరి హీరోలకు బ్యాడ్ టైం..భయపెడుతున్న వేణుస్వామీ వ్యాఖ్యలు..!!

ఈ రోజుల్లో కూడా జాతకాలు నమ్ముతారా అంటే అవుననే అనాలిసివస్తుంది బయటపరిస్ధితులు చూస్తుంటే. ఈ రాయి ఉంగరం పెట్టుకోండి..మీరు కోటీశ్వర్లు అవుతారు అని ఏ జోతిష్యుడో చెప్పితే టక్కున నమ్మి డబ్బులు ఉన్నా లేకున్న అప్పుచేసి మరీ వాళ్లు చెప్పిన్నట్లు చేసే జనాలు మనలో చాలామందే ఉన్నారు. కొన్ని సార్లు వాళ్లు చెప్పిన్నట్లు కూడా జరుగుతాయి.

ఇక అలాంటి వారిలో ఈ వేణుస్వామీ కూడా ఒకరు. ఆయన చెప్పింది చెప్పిన్నట్లు జరిగిపోతుంటాయి అందుకే ఈయన మాటాలు అందరు ఎక్కువుగా నమ్ముతుంటారు. దానికి ది బెస్ట్ ఉదాహరణ సమంత నాగచైతన్య విడాకులు. వీళ్ల పెళ్ళి కాకముందే ఈయన వాళ్ళు కలిసి ఉండలేరు..వాళ్ల జాతకాలు కలవలేదు..రాసిపెట్టుకోండి …వాళ్ళు విడిపోతారు అని ధీమాగా చెప్పారు. షాకింగ్ గా ఆయన చెప్పింది చెప్పిన్నట్లే ..జరిగింది. ఎవ్వరు ఊహించని విధంగా..సమంత చైతన్య విడాకులు తీసుకుని వేరు వేరుగా బ్రతుకుతున్నారు.

కాగా, ఇప్పుడు మరోసారీ ఇండస్ట్రీలోని ప్రముఖుల జాతకాలు గురించి చెప్పుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు వేణు స్వామి. మొదటగా అల్లు అర్జున్ గురించి చెప్పుతూ..ఆయన కి తిరుగులేదు అని..రాబోయే ఐదు సంవత్స్రాలు అల్లు అర్జున్ జాతం కం సూపర్ గా ఉందని. ఏ సినిమా తీసినా 200 కోట్లు కలెక్షన్స్ సాధిస్తుందని చెప్పుకొచ్చారు. అలాగే హీరోయిన్స్ విషయానికి వస్తూ..సమంత, రష్మిక,పూజా హెగ్డే ఈ ముగ్గురు కూడా కొన్నిసంవత్సరాలు సినీ ఇండస్ట్రీని ఏలేస్తారని చెప్పుతూ..ఇద్దరు బడా స్టార్ హీరోలకు మాత్రం టైం బ్యాడ్ గా ఉందని..వాళ్లకు తీవ్ర అనారోగ్య సమస్యలతో..బాధపడుతూ వాళ్లు కమిట్ అయిన సినిమాలు క్యాన్సిల్ అయ్యే వరకు వస్తాయని చెప్పి అభిమానులు గుండె గుబేళ్లు మనిపించాడు. ఇక ఆ ఇద్దరు హీరోలు ఎవరా అంటూ..నెట్టింట చర్చలు మొదలైయ్యాయి.

Share post:

Popular