లైగర్ పాప మొదలెట్టిందిగా!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాను పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కిస్తున్నాడు పూరీ

బాక్సర్‌గా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండేను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు చిత్ర యూనిట్. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ముగించేసిన ఈ బాలీవుడ్ పాప, తాజాగా డబ్బింగ్ కూడా స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించి ఓ వీడియోను అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

లైగర్ సినిమాలో నటించడం తనకు చాలా బాగా నచ్చిందని.. పూరీ జగన్నాధ్, ఛార్మీ, విజయ్ దేవరకొండలు తనను బాగా చూసుకున్నారంటూ పలు ఇంటర్వ్యూలో అమ్మడు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎంత ఫాస్ట్‌గా ఈ సినిమా షూటింగ్ మొదలెట్టారో, అంతే స్పీడుగా దీన్ని ముగించేందుకు చిత్ర యూనిట్ తెగ ప్రయత్నించిందని.. ఈ సినిమా అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అనన్యా అంటోంది. మరి ఈ సినిమాలో అనన్యా పాండే పాత్ర ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Share post:

Popular