సినిమాల మోజులో ప్రియమణి అంత తప్పు చేసిందా…?

అందాల భామ ప్రియమణి. అప్పుడెప్పుడొ ఎవ్వరే అతగాడు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ..ఇప్పటికీ ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉంది. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చిన..ఆ తరువాత రీఎంట్రీ లో మంచి మంచి ఆఫర్స్ అందుకుంటూ బిజీ గా మారిపోయింది. కెరీర్ స్టార్టింగ్ లో తెలిసో తెలియకో వచ్చిన సినిమాలన్నింటికి సైన్ చేసి సినిమాల్లో నటించేసిన ఈ బ్యూటీ..ఫలితంగా బోలెడు ఫ్లాప్ సినిమాలో తన ఖాతాలో వేసుకుంది. ఒక్క జగపతిబాబుతో నటించిన పెళ్లైన కొత్తల్లో సినిమా మాత్రమే ఏదో ఓ మోస్తరుగా రాణించింది..తప్ప..మిగతావన్నీ బిస్కెట్ అయ్యాయి.

ఇక ఆ తరువాత రాజమౌళి డైరెక్షన్ లో యమ దొంగ లో తారక్ తో కలిసి ఆడి పాడి..తన అమాయకపు నటనతో కుర్రాళ్ల మనసులు దోచ్చేసింది. ఇక మళ్ళీ అమ్మడు కెరీర్ ఫాంలోకి వచ్చింది అనుకునే టైంకి..రెమ్యూనరేషన్ ఎక్కువుగా డిమాండ్ చేసి,..చేతులారా మంచి మంచి అవకాశాలను మిస్ చేసుకుంది. అప్పట్లో బడా హీరో సినిమాలో ఛాన్స్ వస్తే చేయకుండా..రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేసి..ఫైనల్ గా రిజెక్ట్ చేసి..ఓ చిన్న ఫేడ్ అవుట్ హీరో సినిమాలో నటించింది. అంతే ఆ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అమ్మడు అవకాశాలు కరువైయ్యాయి. ఇక ఆ టైంలో పారితోషకం తగ్గించుకున్నా అవకాశం ఇచ్చే నాధుడే లేకపోయాడు.

దీంతో కొంతకాలం కెరీర్ కు గ్యాప్ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ..ఆ టైంలో నే ముస్తఫా అనే పెళ్లైన ఓ అబ్బాయిని మళ్లి పెళ్లి చేసుకుంది. ఇక మెల్లగా బుల్లితెర పై షోకి జడ్జీ గా వ్యవహరించింది . అక్కడికి వచ్చే బడా గెస్ట్ల కళ్లల్లో పడింది. ఇక మెల్ల మెల్లగా అవకాశాలు అందుకుంటూ సెకండ్ ఇన్నింగిస్ ని ఓ రేంజ్ లో ప్లాన్ చేసుకుంది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించి మంచి మార్కులే వేయించుకుంది. ఆ తరువాత వెంకటేష్ నారప్ప సినిమాలో చించేసింది. ఈ మధ్యనే భామకలాపం అంటూ ఇరగదీసింది. అంతేకాదు రానా హీరోగా నటించిన విరాటపర్వం సినిమాలోను కీలక పాత్రల్లో నటించింది . ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవ్వరికి తెలియదు. ఇలా కెరీర్ మొదట్లో డబ్బుకోసం మంచి అవకాశాలను వదులుకున్నా..సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం బుద్ధిగా ఉంటూ నచ్చిన సినిమాలను ఓకే చేస్తుంది. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా చేస్తూ నే..మరో వైపు సినిమాలో కూడా నటిస్తుంది ప్రియమణి.

Share post:

Popular