ఏవమ్మా లావణ్య త్రిపాఠి ..ఏంటి నీ ఈ “అతి” ..?

యస్..ఇప్పుడు అందరు లావణ్య త్రిపాఠి ని ఈ విషయమే ప్రశ్నిస్తున్నారు. లావణ్య త్రిపాఠి కి తెలుగులో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. క్రేజ్ కూడా ఉంది. అమ్మడు చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ కాకపోయినా..ఓ మోస్తారు గా రాణించాయి. లుక్స్ బాగుంటాయి..నటన పరంగా కూడా పెద్ద తీసిపారేయాల్సిన పనిలేదు. సో.. అడపదడపా పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తూ..అలా హీరోయిన్ గా నెట్టుకొస్తుంది. మరీ ఎక్కువ కాలం అయితే అమ్మడు ని మ్యానేజ్ చేయలేరు డైరెక్టర్స్ అంటున్నారు నెటిజన్స్.

సినిమాల పరంగా లావణ్య త్రిపాఠి ని ఎవరు ప్రశ్నించే విధంగా ఆమె చేసుకోవడంలేదు. కానీ, ఈ మధ్య అమ్మడుకు సంబంధించిన ఓ మ్యాటార్ టూ హాట్ ట్రెండింగా వైరల్ అవుతుంది. హా..అదే..మెగా ప్రీన్స్ వరుణ్ తేజ్ కు ఈమెకు మధ్య ప్రేమాయణం నడుస్తుందని..గతంలో వీళ్ళు కలిసి సినిమాలు చేసే టైంలోనే అమ్మడు వరుణ్ కి క్లోజ్ అయ్యిందని..అది కాస్త ఇప్పుడు విడతీయ్యరాని ప్రేమ గా మారిపోయిందని..త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. ఇక ఈ న్యూస్ లు రోజు రోజుకి ఎక్కువ అవుతుండటంతో కొందరు డైరెక్ట్ గా నాగబాబు ని కూడా అడగటంతో..ఆయన అలాంటిది ఏం లేదు అని సింపుల్ గా దాటేశారు. లావణ్య కూడా మా మధ్య అలాంటిది లేదు అనే విధంగానే చెప్పుకొచ్చింది.

కానీ, తాజా గా మళ్ళీ అమ్మడు చేసిన ట్వీట్ వీళ్ల మధ్య ఏదో ఉంది అనేలా అనిపిస్తుంది అందరికి. వరుణ్ హీరో గా నటించిన గని సినిమా నేడు విడుదలైంది. ఈ సినిమా కోసం వరుణ్ కి..చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పుతూ ట్వీట్ చేసింది. ఇక్కడే నెటిజన్లకి కోపం వచ్చింది. “మీ మధ్య ఏం లేదంటున్నారు. సరే..మంచిది. కానీ మీ పై ఇలాంటీ వార్తలు వస్తున్న టైంలో నువ్వు ఇలా ట్వీట్ చేయడం అవసరమా..? పోనీ ఆ సినిమాలో నువ్వు ఉన్నావా..? లేదు..మరి నీకెందుకు ఈ అతి పనులు..జనల్లో అటెన్షన్ కోసం ఇలా చేస్తున్నావా..ఏంటి” అంటూ ప్రశ్నిస్తున్నారు. హీరోయిన్ గా నువ్వు నీ పని చూసుకుంటే అటు వరుణ్ కి ఇటు నీ సినీ కెరీర్ కి ఇద్దరికి మంచిది..”అంటూ నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. కొందరైతే ఆమె మెగా ఇంటి కోడలు కావడం మెగా ఫ్యాన్స్ కి ఇష్టం లేదు అందుకే ఇలా చెప్పుతున్నారు అంటూ చర్చించుకుంటున్నారు. దీంతో మళ్లీ వరుణ్-లావణ్య లవ్ టాపిక్ నెట్టింట హాట్ గా మారింది.

Share post:

Popular