రాధేశ్యామ్‌కు స‌పోర్ట్‌గా వైసీపీ ఫ్యాన్స్‌..!

రాధే శ్యాం సినిమా రాడ్డు… లేదు రాధే శ్యాం సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ రెండు మాటలతో సోషల్ మీడియా మార్మోగిపోతుంది. కేరళ వాళ్ళు కూడా రాధే శ్యాం సినిమా స్లో గా ఉందని పోస్ట్ లు పెట్టడం ఈ మధ్య కాలంలో వింతగా మారిన అంశం. స్లో సినిమాలకు మలయాళం పుట్టినిల్లు. అలాంటి మలయాళం లో ఇలాంటి కామెంట్ రావడం ఆశ్చర్యమే. ఇక ఇదిలా ఉంచితే ఇప్పుడు రాధే శ్యాం సినిమాను పవన్ కళ్యాణ్ ఫాన్స్ టార్గెట్ చేసి ఫ్లాప్ చేసారనే మాట ఎక్కువగా వినపడుతుంది.

అయితే ప్రభాస్ విషయంలో పవన్ ఫాన్స్ ఆగ్రహంగా ఉండటానికి ఒక బలమైన కారణం ఉందనే టాక్ వినపడుతుంది. సినిమా టికెట్ లకు సంబంధించి ధరలు పెంచాలని ప్రభాస్ వెళ్ళాడు. సినిమా పెద్దల బృందం తో కలిసి ప్రభాస్ వెళ్ళడం ఆ తర్వాత సినిమా టికెట్ ధరలను ఏపీ ప్రభుత్వం పెంచడం అన్నీ జరిగాయి. భీమ్లా నాయక్ సినిమా టికెట్ ధరలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఇది పవన్ ఫాన్స్ ఏ మాత్రం జీర్నిన్చుకోలేదు. ఇక పవన్ కళ్యాణ్ జీవో చింపడం కూడా బాగా హైలెట్ అయింది.

దీనితో వైసీపీ వాళ్ళు ఎక్కువగా భీమ్లా నాయక్ సినిమాను టార్గెట్ చేయడం పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి నచ్చ లేదు. ఇటు ప్రభాస్ ఫాన్స్ కూడా పవన్ సినిమాను పాత గొడవలతో టార్గెట్ చేసారు. అయితే పవన్ సినిమాను టార్గెట్ చేసి… ప్రభాస్ సినిమాకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తీసుకురావడానికి వైసీపీ కార్యకర్తలు కొందరు ట్రై చేసారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది పవన్ ఫాన్స్ కు నచ్చలేదు. పవన్ కు ఓటు వేసినా వేయకపోయినా సరే వాళ్ళు పవన్ విలువ తగ్గించడానికి చూడరు . అందుకే ఆ కోపం అంతా కూడా ప్రభాస్ మీద చూపించి రాధే శ్యాం సినిమాను టార్గెట్ చేసారు.

Share post:

Latest