జ‌గ‌న్ షాకింగ్ డెసిష‌న్‌… కేబినెట్లోకి మేక‌పాటి స‌తీమ‌ణి శ్రీకీర్తి…!

ఇటీవల హఠాన్మరణం చెందిన ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల శాఖ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే జగన్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే గౌతమ్ రెడ్డికి చాలా బెస్ట్ ఫ్రెండ్. వీరిద్దరూ ఒకే వయసు ఉన్న వారు కావడంతో రాజకీయాలతో సంబంధం లేకుండా వీరి స్నేహం ఎప్పటినుంచో కంటిన్యూ అవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే జగన్ వైసీపీ స్థాపించిన వెంటనే నెల్లూరు జిల్లా నుంచి మేకపాటి కుటుంబం ముందుగా ఆ పార్టీలోకి జంప్ చేసింది. 2014 ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నుంచి పోటీ చేసి ఏకంగా 31 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయింది. అయితే గత ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి కావడంతో తన సన్నిహితుడుకు కీలకమైన పరిశ్రమలు.. ఐటీ శాఖ కట్టబెట్టారు. గౌతమ్ రెడ్డి కూడా వివాదాల‌కు, రాజకీయాలకు దూరంగా తనపై ఎలాంటి మ‌ర‌క‌ లేకుండా తన శాఖను నిర్వహిస్తూ వస్తున్నారు. జగన్‌కు కూడా మిగిలిన మంత్రులు చాలామంది పై అసంతృప్తి ఉన్న.. గౌతమ్ రెడ్డి విషయంలో ఎప్పుడు సంతృప్తి తోనే ఉంటారు.

అయితే ఇటీవల ఏపీకి పెట్టుబడిలో రప్పించేందుకు దుబాయ్ వెళ్లిన గౌతమ్ రెడ్డి ఇండియాకు తిరిగి వచ్చిన మరుసటి రోజే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆత్మకూరు నియోజకవర్గానికి మరో నాలుగు నెలల్లో ఉప ఎన్నికలు రానున్నాయి. ఎన్నికల్లో వైసీపీ నుంచి గౌతమి రెడ్డి భార్య శ్రీకీర్తి పోటీ చేయడం దాదాపు ఖరారైంది. గౌతమ్‌ రెడ్డి ఉత్తరక్రియలు ముగిసిన వెంటనే జగన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఇప్పుడు జగన్ మరో సంచలన నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే మంత్రివర్గ విస్తరణలో శ్రీకీర్తికి చోటు కల్పిస్తారని అంటున్నారు. ఆత్మకూరు టికెట్ ఎలాగూ శ్రీ కీర్తికి ఇస్తారు. అయితే ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఆమె గెలుపు లంఛ‌నం కావడంతో మంత్రి పదవి కూడా ఆమెకే ఇస్తారని ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గం లో చాలామంది సీనియర్ నేతలు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళకు చెక్‌ చెప్పాల‌నే జగన్ కీర్తికి మంత్రి పదవి కేటాయించ బోతున్నారని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.