తారక్ ఫ్యాన్స్‌కి కిక్కెంచే న్యూస్.. ఆరు బాలీవుడ్ బడా బిగ్ ఆఫర్స్..!!

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం RRR. టాలీవుడ్ బడా హీరోలు మెగా వారసుడు రాం చరణ్-నందమూరి వారసుడు..తారక్..లు కలిసి ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా నటించిన మూవీ రణం రౌద్రం రుధిరం..ఈ సినిమా మార్చి 25 న విడుదలై బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా..ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కలెక్షన్స్ పరంగా ఈ సినిమా దూసుకుపోతుంది.

కాగా, ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించగా, అల్లూరి సీతారామరాజు రోల్ లో రామ్ చరణ్ కనిపించి అభిమానులను తమ నటనతో మెప్పించారు. ఈ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ మెగా, నందమూరి అభిమాన లోకానికి కన్నుల పండగ అయిందని చెప్పడం లో సందేహం లేదు. ముఖ్యం గా ఈ సినిమా రిలీజ్ తరువాత..కొందరు ఫ్యాన్స్..ఈ సినిమాలో తారక్ ని తక్కువగా చూయించారని..చరణ్ నే టోటల్ సినిమాకి హైలెట్ చేశారని మడిపడ్డారు. కానీ ఈ విషయం పై ముందే రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో పాత్రలు మీరు గుర్తుంచుకోవాలని హీరో స్టేటస్ మైండ్ లో పెట్టుకుని చూస్తే సినిమాకి కనెక్ట్ అవ్వలేరని చెప్పారు.

ఇక ఈ సినిమాలో తారక్ స్క్రీన్ టైం తక్కువ అయిన్నప్పటికి .. ఉన్న టైంలో తనకి ఇచ్చిన రోల్ కి పూర్తి న్యాయం చేశాడు. తన నటనతో..అమాయకత్వంతో..ధియేటర్స్ కి వచ్చిన ప్రజలని నవ్విస్తూనే,,ఎమోషనల్ సీన్స్ లో..కన్నీరు తెప్పించాడు. ఇక ఈయన నటన చూసి..ఖచ్చితంగా నేషనల్ అవార్డు పక్కా అని అంటున్నారు అభిమానులు. ఈ క్రమంలో నే తారక్ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఫేమస్ సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్ట్ మెంబర్ ఉమైర్ సంధు సినిమా రిలీజ్ కు ముందు నుండే సినిమా పై పొగడ్తల వర్షం కురిపించాదు.

ఇక రీసెంట్ గా తారక్ నటన గురించి పొగుడుతూ ట్వీట్ చేసిన ఆయన ..బాలీవుడ్ నుండి తారక్ కి ఆరు బడా బిగ్ ఆఫర్స్ రెడీ గా ఉన్నాయని ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనా ప్రతిభ చూసి బీ టౌన్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ ఆయన డేట్స్ కోసం క్యూ కట్టాయని చెప్పుకొస్తూ.. ప్రస్తుతం ఆయనకు 6 బిగ్గెస్ట్ సినిమాల ఆఫర్స్ వచ్చాయని ట్వీట్ చేశారు.దీంతో తారక్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కానీ దీని పై తారక్ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.

Share post:

Latest