త్రివిక్ర‌మ్‌పై మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ అస‌హ‌నం.. ప‌వ‌న్ డేట్లు ఇవ్వ‌కుండా అడ్డు ప‌డ‌డ‌మే కార‌ణ‌మా ?

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వ‌రుస‌గా లైన్లో ఉన్నాయి. ఒక‌టి కాదు రెండు కాదు చాలా సినిమాల‌ను వ‌రుస పెట్టి లైన్లో పెట్టేస్తున్నాడు. ఇటు భీమ్లానాయ‌క్ అయ్యిందో లేదో వెంట‌నే మ‌రో కోలీవుడ్ సినిమా రీమేక్ అంటూ ఓ సినిమా తెర‌మీద‌కు వ‌చ్చేసింది. పైగా ఇది కూడా మ‌ల్టీస్టార‌ర్‌.. సాయిధ‌ర‌మ్ తేజ్ ఇందులో మ‌రో హీరో.

ఈ సినిమా మాత్ర‌మే కాదు నెక్ట్స్ ప‌వ‌న్ సినిమాల లైన‌ప్ చూస్తే హ‌రీష్ శంక‌ర్ – త్రివిక్ర‌మ్ – క్రిష్ వీర‌మ‌ల్లు ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల‌పై ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చినా స‌డెన్‌గా మ‌ధ్య‌లో మ‌రికొన్ని సినిమాలు వ‌చ్చేస్తున్నాయి. దీంతో గ‌తంలో ప‌వ‌న్‌కు బ్లాక్ బస్ట‌ర్ హిట్ ఇచ్చిన డైరెక్ట‌ర్ సినిమా మాత్రం ప‌ట్టాలు ఎక్క‌డం లేదు. ఆ సినిమాపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది.

అయితే ప‌వ‌న్ ఆ డైరెక్ట‌ర్‌కు డేట్లు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆ హీరో ప‌వ‌న్ సినిమా కోసం వేచి చూస్తున్నాడే.. త‌ప్పా మ‌రో సినిమా చేసుకోలేని ప‌రిస్థితి. కేవ‌లం త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ సినిమాల చుట్టూ ఓ నియంత‌లా మారి త‌న‌కు న‌చ్చిన డైరెక్ట‌ర్ల‌కే డేట్లు ఇప్పిస్తున్నాడ‌ని స‌ద‌రు డైరెక్ట‌ర్ అస‌హ‌నంతో ఉన్నాడ‌ట‌. ఆ మాట‌కు వ‌స్తే ఆ డైరెక్ట‌ర్ మాత్ర‌మే కాదు.. ప‌వ‌న్ సినిమాల విష‌యంలో త్రివిక్ర‌మ్ జోక్యం మ‌రీ ఎక్కువుగా ఉంటోంద‌ట‌.

ఇటీవ‌ల భీమ్లానాయ‌క్ సినిమా విష‌యంలో అలాగే జ‌రిగింది. ఇప్పుడు త్రివిక్ర‌మ్ చెప్పిన దానిని బ‌ట్టే ప‌వ‌న్ ముందుగా ఏ డైరెక్ట‌ర్‌కు డేట్లు ఇవ్వాలో వినే స్థాయి వ‌ర‌కు రావ‌డంతో చాలా మంది అస‌హ‌నంతోనే ఉంటున్నార‌ట‌. ఇక ఆ డైరెక్ట‌ర్ కూడా వేచి చూసి ప‌వ‌న్ డేట్లు ఇవ్వ‌క‌పోతే మ‌రో సినిమాకు రెడీ అయిపోతార‌నే గుస‌గుస‌లు వ‌స్తున్నాయి.

Share post:

Popular