ప‌క్కా బ్లాక్ బ‌స్ట‌ర్ బొమ్మ ఇదే… ‘ డీజే టిల్లు ‘ ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్‌..!

క‌రోనా మూడో వేవ్ త‌ర్వాత అఖండ లాంటి పెద్ద సినిమాతో వ‌రుస‌గా సినిమాలు థియేట‌ర్ల‌లోకి రావ‌డం మొద‌లు పెట్టేశాయి. బాల‌య్య అఖండ త‌ర్వాత‌, బ‌న్నీ పుష్ప కూడా వ‌చ్చింది. ఇక సంక్రాంతికి బంగార్రాజు వ‌చ్చింది. ఈ మూడు పెద్ద సినిమాలు హిట్ అయ్యాయి. ఇక చిన్న సినిమాల్లో పెద్ద హిట్ ఏదంటే ఖ‌చ్చితంగా డీజే టిల్లునే అని చెప్పాలి. నిజంగా ఈ యేడాది చిన్న సినిమాల‌కు పెద్ద బూస్టింగ్‌గా ఈ సినిమా నిలిచింది.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా యంగ్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు విమల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ సినిమా ముందే టేబుల్ ప్రాఫిట్స్ సొంతం చేసుకుంది. ఇంకా చెప్పాలంటే రూపాయికి రూపాయికి పైగా థియేట్రిక‌ల్ ర‌న్ ద్వారానే లాభం తెచ్చిపెట్టింది.

కేవ‌లం థియేట్రిక‌ల్ ద్వారానే కాకుండా.. ఇటీవ‌ల ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యి అక్క‌డ కూడా సాలిడ్ రెస్పాన్స్ రాబ‌ట్టుకుంది.

నైజాం – 7.11 కోట్లు
సీడెడ్ – 1.88 కోట్లు
ఉత్తరాంధ్ర -1.39 కోట్లు
తూర్పు గోదావరి – 79 లక్షలు
వెస్ట్ గోదావరి – 80 లక్షలు
గుంటూరు – 77 లక్షలు
కృష్ణా – 66 లక్షలు
నెల్లూరు – 46 లక్షలు
————————————-
ఏపీ + తెలంగాణ = 13.86 కోట్లు
————————————-
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా – 1.01 కోట్లు
ఓవర్సీస్ – 2.05 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – రూ 16.92 కోట్లు షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా డిస్ట్రిబ్యూట‌ర్ల‌తో పాటు అటు సితార ఎంట‌ర్టైన్‌మెంట్ వారికి కూడా భారీ లాభాలు తెచ్చిపెట్టింది.

Share post:

Popular