తమ రియల్ నేమ్స్.. సినిమా టైటిల్ గా పెట్టి.. ఫ్లాప్ చవిచూసిన హీరోలు వీళ్లే..?

సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరు అన్నది ఎంత ముఖ్యమో సినిమాకి టైటిల్ ఏ పెడుతున్నాము అన్నది కూడా అంతే ముఖ్యం.. ఎందుకంటే సినిమా టైటిల్ ప్రేక్షకులందరిలోకి ఆ సినిమా తీసుకు వెళ్లే విధంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే విధంగా ఉండాలి. అందుకే టైటిల్ విషయంలో అటు దర్శకనిర్మాతలు కాస్త జాగ్రత్త పడుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు స్టార్ హీరోలు చేసే సినిమాలకు ఇక హీరోల బిరుదులు లేదా నిజమైన పేర్లే టైటిల్ గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇలా తమ పేర్లను టైటిల్ గా పెట్టి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన కొంతమంది హీరోలు చివరికి ఫ్లాపులతో నిరాశపడ్డారు. ఇప్పుడు ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

చిరంజీవి : మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో మకుటం లేని మహారాజుగా కొనసాగుతున్నాడు. అయితే 1995లో మెగాస్టార్ ఇక ఆయన సినిమాకు చిరంజీవి అనే టైటిల్ పెట్టారు. ఇందులో విజయశాంతి భానుప్రియ హీరోయిన్ లుగా నటించారు. అయితే ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలిపోయింది.

అఖిల్ : నాగార్జున ముద్దుల తనయుడు అఖిల్ అక్కినేని వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే తన మొదటి సినిమాకి తన పేరునె టైటిల్ గా పెట్టుకున్నాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ గానే మిగిలిపోయింది.

రామ్ చరణ్ : రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన వినయ విధేయ రామ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య వచ్చింది. కానీ బోయపాటి టేకింగ్ నచ్చకపోవడంతో చివరికి ఫ్లాప్ అయింది.

మంచు విష్ణు : మోహన్ బాబు నట వారసుడిగా మంచు విష్ణు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మొదటి సినిమాకు టైటిల్గా ఇక విష్ణు అనే పేరు పెట్టారు. ఇక ఈ సినిమా పెద్దగా ప్రేక్షకుల ఆదరణ పొందలేదు.

నాగార్జున : టాలీవుడ్ మన్మథుడు గా పేరు సంపాదించుకున్న నాగార్జున ఇక ఆయన పేరునే టైటిల్గా పెడుతూ కెప్టెన్ నాగార్జున సినిమా చేశాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.

ఎన్టీఆర్ : నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రామయ్యా వస్తావయ్యా. ఇక ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో ఫ్లాప్ గానే మిగిలిపోయింది అని చెప్పాలి. ఇలా తమ పేర్లను టైటిల్గా పెట్టుకొని చివరికి ఫ్లాపులతో నిరాశ చెందారు ఎంతో మంది హీరోలు..

Share post:

Latest